వాజ్ పేయి అంత్యక్రియలు పూర్తి…

0
45

భారత మాజీ ప్రధాని, “భారత రత్న” అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలు ముగిశాయి. వేలాది మంది అభిమానులు, దేశవిదేశాలకు చెందిన నేతలు, ప్రభుత్వాధినేతల సమక్షంలో ఢిల్లిలోని రాజ్ ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ లో హింధు సంప్రదాయ పద్దతిలో వాజ్ పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి. వాజ్ పేయి దత్తపుత్రిక నమిత, మనవరాలు నిహారికతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు చివరి లాంఛనాలను పూర్తి చేశారు. వేద మంత్రాలతో పాటుగా “అటల్ జీ కీజై” అంటూ ఆయన అభిమానుల నినాదాల మధ్య వాజ్ పేయి దత్త పుత్రిక తన తండ్రి చితికి నిప్పంటించారు. గౌరవ సూచకంగా సైనిక దళాలు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపాయి.

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఆయన మంత్రి వర్గ సహచరులు రాజ్ నాధ్ సింగ్, సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్ తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్లోలు పలికారు.

భూటాన్ రాజుతో పాటుగా, ఆప్ఘనిస్తాన్, నేపాల్,శ్రీలంక,జపాన్ లకు చెందిన ప్రతినిధులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కే.అధ్వాని, మురళీ మనోహర్ జోషి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ లాంటి ఎందరో నేతలు వాజ్ పేయి అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకు ముందు వాజ్ పేయి ఇంటి నుండి ఆయన పార్థీవ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బీజేపీ పార్టీ కార్యాలయానికి తరలించారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, ప్రజలు వాజ్ పేయికి నివాళులు అర్పించారు. అక్కడి నుండి మద్యాహ్నం 1.30కు అంతిమ యాత్ర మొదలాంది. వేలాది మంది ఈ మహానేత అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

Wanna Share it with loved ones?