వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో టీఆర్ఎస్ పై ప్రజాగ్రహం రోజురోజుకీ పెరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పై నమ్మకం పోయిందని తమ సర్వేల్లో ఈ విషయం స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మాటలతోనే సరిపుచ్చుతున్నారని క్షేత్రస్థాయిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడంలేదని ఉత్తమ్ ధ్వజమెత్తారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో రోజురోజుకీ ఆదరణ పెరుగుతోందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని రైతులందరికీ రెండులక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను ఓకేసారి మాఫీ చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు భీమా పథకం ద్వారా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. రైతుల రుణమాఫీ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకని నోరుమెదపడంలేదని ఆయన ప్రశ్నించారు.
రైతులను ఆదుకుంటాని చెప్తున్న కేసీఆర్ సర్కారు వారిని నట్టేముంచిందన్నారు. రుణాల మాఫీ వ్యహారంగానీ, పంట భీమా విషయంలోగానీ రైతులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బారీగా అంచానా వ్యాయాలు పెంచుకుంటూ ప్రాజెక్టులన్నీ అవినీతికి కేరాఫ్ ఆడ్రస్ గా మారాయన్నారు. ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం దోచిపెడుతోందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ముందు అనేక వాగ్ధానాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చినతరువాత వాటినన్నింటినీ తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుని తింటోందన్నారు. ధనిక రాష్ట్రంగా ఒక వైపు చెప్తునే వేలాది కోట్ల రూపాయల అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతికి కేంద్రంగా మారిందన్నారు. వేలాది కోట్ల రూపాయలను దోచుకుని తింటున్నారని అన్నారు.
రాష్ట్రంలో నిరంకుశ ప్రభుత్వం నడుస్తోందని గడీల తరహాలో కేసీఆర్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులకు కూడా స్వేచ్చలేదని కేవలం కేసీఆర్ కుటుంబానికి తప్ప మిగతా ఎవరికి అధికారాలు లేకుండా చేశారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారారని అంటూ తమ అవినీతి వారికికూడా వాటాలు ఇస్తుండడంతో వారు నోరు మెదపడంలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత లాభపడింది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్థులు ఇట్లా ఏ ఒక్కరూ కేసీఆర్ పాలన పట్ల సంతృప్తిగాలేరని కేవలం కొంత మంది కాంట్రక్టర్లు, బడా బాబులు మాత్రం తెలంగాణ ప్రభుత్వ పాలన పట్ల సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. పాలన పూర్తిగా పడకేసిందని అన్నారు. ప్రభుత్వ ఉదాశీనత వల్ల కొంత మంది రజకార్ల మాదిరిగా ప్రజలపై పడి దోచుకుని తింటున్నారని ఎదురుతిరిగిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
congress party, telangana congress , telangana congress party, tpcc, uttam kumar reddy, uttamkumar reddy, tpcc chief, gandhi bhavan, trs, telangana, telangana state, kcr, telangana cm, telangana cm kcr.