గ్రీన్ కార్డ్

గ్రీన్ కార్డ్ ల కోసం భారతీయ అమెరికన్ల ర్యాలీ

అమెరికాలో శాశ్వతంగా నివాసం కోసం ఇచ్చే అర్హతా పత్రం ( గ్రీన్ కార్డ్ ) ల జారీ విషయంలో జరుగుతున్న జాప్యంపై అమెరికాలోని భారతీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హెచ్1-బీ వీసాలపై అమెరికా వెళ్ళిన వారిలో చాలా మంది గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తులు చేస్తుంటారు. వీటికోసం దరఖాస్తుచేసి వాటికోసం వేచిచూస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. గ్రీన్ కార్డులు జారీచేయడంలో ఏడాదికి దేశాలవారీగా పరిమితిని విధిస్తున్నారు. దీనివల్ల భారతీయులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.
గ్రీన్ కార్డుల జారీకి సంబంధించిన పరిమితిని ఎత్తివేయడంతో పాటుగా దేశాలవారీ కోటాను రద్దు చేయాలని కోరుతూ అమెరికాలో ఉంటున్న భారతీయులు ఆందోళన నిర్వహించారు. అనేక నగరాల్లో ర్యాలీలు జరిపి తమ డిమాండ్ కు మద్దతు ఇవ్వాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు.Releated

సుష్మస్వరాజ్ కన్నుమూత

సుష్మాస్వరాజ్ కన్నుమూత…

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశాలు. తీవ్ర గుండెపోటుతో ఆమె చనిపోయారు. 67 సంవత్సరాల సుష్మ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనివల్లే ఆమె పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. సుష్మాకు మంగళవారం రాత్రి గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు దిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు మార్చారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సురి […]

సుదర్శన యాగం

యాదాద్రిలో భారీ ఎత్తున సుదర్శన యాగం

యాదగిరి గుట్ట దేవాలయ పుననిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చేదిద్దేపనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ యాగ నిర్వహణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామితో ముఖ్యమంత్రి చర్చించారు. యాదాద్రిలో వంద ఎకరాల యజ్ఞవాటికలో 1048 యజ్ఞ కుండాలతో యాగం నిర్వహించాలని నిర్ణయించారు. మూడు వేల మంది రుత్వికులు, మరో 3వేల […]