అమెరికా ఈబీ-5 విసా గడువు పెంచే అవకాశం

0
75

అమెరికా లో స్థిరపడాలనుకునే భారతీయులకు ఇచ్చే పలు రకాల విసాల విషయంలో అమెరికా ప్రభుత్వం కఠినంగానే వ్యవహరస్తున్న నేపధ్యంలో మన దేశం నుండి అమెరికాకు వెళ్లాలనుకునే వారిలో ఆర్థికంగా స్థిరపడిన వారు ఈబీ-5 విసాను ఆశ్రయిస్తున్నారు. ఈ విసా ద్వారా అమెరికాలో 5 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టడంతో పాటుగా 10 మంది అమెరికన్లకు ఉద్యోగ అవకాశం కల్పించే వారితో పాటుగా వారి కుటుంబం ఈ విసాపై అమెరికాకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ వీసా కింద అమెరికాకు వెళ్తున్న వారిలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశానిక చెందిన వారు ఈ వీసాను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ వీసా గడువు డిసెంబర్ 8వ తేదీతో ముగియ నుంది. ఈబీ-5 వీసాకు ఆధరణ లభిస్తుండడంతో పాటుగా దీని వల్ల అమెరికాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెరిగే అవకాశం ఉండడంతో ఈ గడువును పెంచే అవకాశం ఉందని బావిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చెపట్టిన తరువాత వీసాల మంజూరులో కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈబీ-5 విసాల విషయంలో మాత్రం ట్రంప్ కాస్త పట్టువిడుపు ధోరణిలో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. దీని ద్వారా పెద్ద సంఖ్యలో అమెరికాలోకి పెట్టుబడులు రావడంతో పాటుగా అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పెరగడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు.



Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here