అమెరికా యుద్ధాల ఖర్చు ఎంతంటే…

ఇటీవల అమెరికా యుద్ధాలకోసం చేసిన ఖర్చు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం… ‘యుద్ధ వ్యయాలు’ పేరుతో బ్రౌన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వాట్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్‌నేషనల్‌ అండ్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ ఒక అధ్యయనం చేసింది. అమెరికా గత పదహారు సంవత్సరాల్లో దాదాపు 5.6 ట్రిలియన్ డాలర్ల ను ఖర్చు చేసినట్టు ఆ నివేదిక వెల్లడించింది.(1ట్రిల్లియన్‌ డాలర్లు అంటే 65లక్షల కోట్ల రూపాయలకు సమానం). ఈ ఖర్చు అమెరికా నేరుగా చేస్తున్న యుద్ధాలకు సంబంధించిందే. ఆ దేశం సైనిక చర్యల కోసం చేస్తున్న ఖర్చును ఈ లెక్కల్లో చూపలేదు. రక్షణ రంగంపై అమెరికా కళ్లు తిరిగేంత ఖర్చు చేస్తోంది. ప్రపంచంలో రక్షణ రంగంపై అత్యంత వ్యయం చేస్తున్న 10దేశాల వ్యయం మొత్తం కంటే అమెరికా చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువ. అమెరికా యుధ్దాలకోసం చేస్తున్న ఖర్చు పై ఇప్పటికే ఆందోళన వ్యక్తం అవుతోంది.