పార్టీ నుండి యూపీ సీఎం సస్పెండ్

తండ్రీ కొడుకుల మధ్య యుద్దం ముదిరి పాకాన పడింది. తండ్రిని దిక్కరించిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను  సమాజ్ వాదీ పార్టీ నుండి ఆరు సంవత్సరాల పాటు పార్టీ  అధ్యక్షుడు అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ సస్పెండ్ చేశారు. పార్టీలో అంతర్గత పోరు రోజురోజుకూ ముదిరి పాకాన పడుతున్న నేపధ్యంలో పార్టీ రాజకీయాల రచ్చకెక్కాయి. అఖిలేష్ ను విభేదిస్తున్న ములాయం సోదరుడు రాంగోపాల్ యాదవ్ ను కూడా పార్టీ నుండి బహిష్కరించారు. వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలతో పార్టీ రచ్చకెక్కింది. ఎన్నికల ముంగిట మలాయం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. ఏకంగా ముఖ్యమంత్రిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం విశేషం. తండ్రి ప్రకటించిన 325 మంది ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితాను బేఖాతరు చేస్తూ అఖిలేష్ తాను కూడా పోటీగా 235మంది అభ్యర్ధులతో జాబితాను ప్రకటించడంతో రగడ ఏర్పడింది. తాను సూచించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ములాయం సీట్లివ్వకపోవడంపై నొచ్చుకున్న అఖిలేష్ తండ్రితో డైరక్ట్ వార్‌కు దిగారు. పోటాపోటీగా తానే జాబితా విడుదల చేసి తన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 171 మందికి సీట్లిచ్చుకున్నారు. అఖిలేష్ చర్యతో ములాయం కన్నెర్ర చేశారు. వెంటనే షో కాజ్ నోటీసులు జారీ చేశారు. అఖిలేష్‌ను, రాంగోపాల్ యాదవ్‌ను ఏకంగా ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ముందు ములాయం సింగ్ తీసుకున్న నిర్ణయం సమాజ్ వాదీ పార్టీ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ములాయం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కుమారుడు అఖిలేష్, సోదరుడు రాంగోపాల్ యాదవ్ లను ములాయం తీవ్రంగా విమర్శించారు. ఇద్దరి మధ్య విభేదాల వల్ల పార్టీ నాశనం అవుతోందన్నారు. తన కుమారుడి భవిష్యత్తును రాంగోపాల్ యాదవ్ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.  జనవరి ఒకటిన సమాజ్‌వాదీ పార్టీ కార్యవర్గ సమావేశానికి రాంగోపాల్ యాదవ్ పిలుపివ్వడాన్ని కూడా ములాయం తప్పుబట్టారు. పార్టీ అధ్యక్షుడికి తప్ప మరొకరికి కార్యవర్గ సమావేశానికి పిలుపివ్వడం కుదరదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో అఖిలేష్ వర్గం ఏ విధంగా ముందకు పోతుందో చూడాల్సిందే. ఎంతమంది తండ్రి వెంట ఉంటారో.. మరెంత మంత తనయుడితో జట్టు కడతారో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *