ఉత్తర్ ప్రదేశ్ లో ఏంజరుగుతోంది-బీజేపీ కలవరం

భారతీయ జనతాపార్టీకి ఉత్తర్ ప్రదేశ్ లో తగులుతున్న వరుస ఎదురుదెబ్బలకు కారణం ఏమిటి…?. సగటు బీజేపీ అభిమాని నుండి పార్టీ అధినాకత్వం వరకు ఇప్పుడు ఇదే ప్రశ్న వాళ్ల మెదళ్లను తొలుస్తోంది. తిరుగులేని మెజార్టీతో 2017 ఎన్నికల్లో బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ పీఠాన్ని కైవసం చేసుకుంది. సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రావడంతో పాటుగా అనేక చోట్ల విపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అప్పటి వరకు అధిరాన్ని వెలబెట్టిన సమాజ్ వాదీ పార్టీ నాయకులు చాలా మంది ఊహించని రీతికి మట్టికరిచారు. 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఒంటరిగానే 312 సీట్లను సంపాదించుకుని అధికారంలోకి వచ్చింది.
ఉత్తర్ ప్రదేశ్ లో విపక్షాలకు తగిన ఎదురుబెద్దలకు అవి కోలుకోవడానికి చాలా సమయంపడుతుందని విశ్లేషకులు భావించారు. ఇప్పుడిప్పుడే విపక్షాలు కోలుకోవడం సాధ్యం కాదని అంచానా వేశారు. అయితే పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారయింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ వరుస ఓటములతో కుదేలైంది. ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మంగా భావిస్తున్న స్థానాలను కూడా విపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖాళీచేసిన ఘోరక్ పూర్ స్థానాన్ని విపక్షాలు కైవసం చేసుకోవడంతో మొదలైన ఆ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూనే ఉంది. వరుసగా ఐదు సార్లు ఘోరక్ పూర్ లో ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ గెలుస్తూ వచ్చారు. ఆ నియోజకవర్గాన్ని కూడా బీజేపీ కోల్పోవడం దానికి పెద్ద ఎదురుదెబ్బే. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన నాలుగు లోక్ సభ స్థానాల ఉప ఎన్నికలను పార్టీ కోల్పోయింది.
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ అధిష్టానం అనూహ్యంగా పార్టీ సీఎంగా యోగి ఆదిత్యనాధ్ ను నియమించింది. బీజేపీ అతివాద నేతగా ఆర్ఎస్ఎస్ తో అత్యంత సన్నిహిత సంబంధాలున్న ఆదిత్యనాధ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు తనదైన శైలిలో పనిచేస్తున్న ఆదిత్యనాధ్ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బీజేపీ తురుపు ముక్కగా ఆయన్ను ప్రమోట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఆదిత్యనాద్ కు అనుకూలంగా పెద్దఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఏకంగా ఆదిత్య నాథ్ ను ప్రధాని మంత్రిగా అభ్యర్థిగా కూడా కొందరు తెరపైకి తీసుకుని వచ్చారు. క్రమంగా ఆదిత్యనాథ్ ప్రభ దేశవ్యాప్తంగా వెలిగిపోతుండగా సొంత నియోజకవర్గంలోనే గట్టి ఎదురుదెబ్బతగలడంతో బీజేపీ అభిమానాలు షాక్ కు గురయ్యారు.
అక్కడి నుండి వరుసగా బీజేపీకి ఉత్తర్ ప్రదేశ్ లో ఎదురుదెబ్బలు తప్పడం లేదు. విపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాటం చేయడం వల్లే తాము ఓటమిపాలు కావాల్సివచ్చిందని బీజేపీ శ్రేణులు తమని తాము సర్ధి చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కోలుకోలేని దెబ్బతగిన మాట మాత్రం వాస్తం అటుతరువాత తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి కైరానాలో ఎదురైన పరాభవం చిన్నదేమీ కాదు.
వరుస ఓటములతో క్రమశిక్షణకు మారుపేరుగా నిల్చే బీజేపీలోనూ లుకలుకలు మొదలయ్యాలు. పార్టీకి తిరుగులేని నాయకుడిగా ఉన్న యోగి పై విమర్శలు మొదలయ్యాయి. నేరుగా ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శలకు దిగుతున్నారు. ఇప్పటికి ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేయగా మరికొందరు ఇదే బాట పట్టనున్నట్టు సమాచారం.
విపక్షాల ఐక్యతతో పాటుగా పార్టీలో రాజకీయ వ్యూహాత్మకత లోపించడం కూడా వరుస పరాజయాలకు కారణంగా భావిస్తున్నారు. యోగి పాలపట్ల ప్రజలు అంత సుముఖంగా ఏమీలేరనే వార్తలు వస్తున్నాయి. కొండంత ఆశతో బీజేపీకి పట్టకట్టినా పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు కనపించడం లేదు. యూపీలోని ప్రభత్వ అధికారుల్లో పేరుకుపోయిన అవినీతి ప్రధాన సమస్యగా మారింది. అధికార పార్టీ మారినప్పటికీ ప్రభత్వ అధికారుల తీరులో మాత్రం ఎటువంటి మార్పు లేకుండా పోయింది. ప్రభుత్వం పథకాలు ఏవీ సామాన్యులకు అందడం లేదు. పాలనలో అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. యోగి తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. అమలు సాధ్యం కానీ హామీలు ఇవ్వడంతో పాటుగా తొందరపాటు నిర్ణయాలు కలవరపెడుతున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ శాంతి భద్రతలకు ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్న యూపీ సర్కారు ఇతర రంగాలను నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. పోలీసులకు కూడా అతి స్వేచ్చ ఇవ్వడం కూడా విమర్శలు రేపుతోంది. మొత్తం మీద యోగి ఆదిత్యనాథ్ యూపీ ప్రజలను సంతృప్తి పర్చలేదని వాదనలు వస్తున్నాయి.
uttar pradesh, up, uttar pradesh bjp, bjp, yogi , yogi adityanath, up cm
Kairana, opposition, Gorakhpur , Phulpur , Samajwadi Party-Mayawati combo, . Samajwadi Party leader Akhilesh Yadav , Noorpur, poor and the Dalits.

యోగికి భంగపాటు


ఆ పాపం తెలుగు సీరియళ్లదే : నన్నపనేని రాజకుమారి
Gorakhpur