రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీవీ యాంకర్ లోబో

0
82
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీవీ యాంకర్ లోబో
tv anchor lobo met with accident in janagama district

ప్రముఖ టీవీ యాంకర్, నటుడు లోబో గా ప్రేక్షకులకు సుపరిచితుడైన మహ్మదయ్ కయిమ్ జనగాం జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. టీవీ యాంకర్ లోబో వరంగల్ నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఆటోను ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డవారిని జనగాం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
స్టార్ మా టీవీలో యాంకర్ గా ఉన్న లోబో సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. కుమారి 21 ఎఫ్ లో అతను చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. టీవీ షోలతో పాటుగా పలు కార్యక్రమాల్లో పాల్గొనే లోబో ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కోసం వరంగల్ నుండి హైదరాబాద్ కు బయలుదేరినట్టు సమాచారం. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే జనగాం డీఎస్పీ మల్లారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడ్డ వారిని పరామర్శించారు.
మరోవైపు లోబో పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. లోబో నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఆ సమయంలో ఆయన మధ్యం సేవించి ఉన్నారనేది గ్రామస్థుల వాదన. ప్రమాదం పై పూర్తి స్థాయి జరుపుతామని పోలీసులు తెలిపారు.
tv anchor, tv anchor lobo, lobo tv anchor, lobo met with accident, tv anchor lobo met with accident, warangal, raghunath palle. janagam district, janagam.

కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య విభేద్దాల్లేవ్


ప్రజలు ఆశీర్వదిస్తే జనసేన దే అధికారం:పవన్ కళ్యాణ్
ముద్ద అన్నం కోసం పోలీసుల ఆరాటం

Wanna Share it with loved ones?