తూత్తకూడి లో హింస -పోలీసు కాల్పుల్లో 9 మంది మృతి

తమిళనాడులోని రేవుపట్టణం తూత్తకూడి లో స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలంటూ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. కలెక్టరేట్ లోకి దుసుకుని పోయేందుకు ప్రయత్నిస్తున్న నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది చనిపోగా అనేక మందికి గాయాలయ్యాయి. రాగి కర్మాగారాన్ని వెంటనే మూసివేయాలంటూ మూడు నెలలుగా జరుగుతున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. దాదాపు 20వేల మందికి పైగా ప్రజలు 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ర్యాలీగా కలెక్టరేట్ బయలుదేరారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆందోళనకారు్లలోని కొందరు హింసకుదిగారు. కలెక్టరేట్ లోకి చొచ్చుకుని పోయే ప్రయత్నం చేయడంతో పాటుగా పోలీసులపై రాళ్లు రువ్వి వారి వాహనాలను తగులబెట్టారు. దీనితో మొదటి లాఠీఛార్జీ, భాష్పవాయు ప్రయోగం చేసిన పోలీసులు చివరకు కాల్పులకు దిగారు. దింట్లో 9 మంది ప్రాణాలు పోగా చాలా మంది గాయపడ్డారు.
స్థానికంగా ఉన్న రాగి పరిశ్రమల వల్ల తమకు ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయంటూ పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కర్మాగారంలో జరిగిన గ్యాస్ లీక్ కారణంగా పెద్ద సంఖ్యలో స్థానికులకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. 2013లో కాలుష్య నియంత్రణ మండలి ఈ ప్యాక్టరీని మూసివేసింది. ఆటు తర్వాత దీని నిర్వాహకులు పలు దఫాలుగా చేసిన విజ్ఞప్తుల మేరకు తిరిగి ప్యాక్టరీని తెరిచారు. ఇందులో రాగిని తయారు చేసిన దేశీయ అవసరాలకు వినియోగించడంతో పాటుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఫ్యాక్టరీ వల్ల తాము అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న చెప్తున్న స్థానికులు తిరిగి ప్యాక్టరినీ తెరిచేందుకు ఒప్పుకోవడం లేదు. ఈ కర్మాగారానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనను విరమించాలని కర్మాగారంలో కాలుష్య నియంత్రణకు సమంబంధించిన అంశాలపై విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కర్మాగారానికి వ్యతిరేకంగా జరపతలపెట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారి 9 మంది ప్రాణాలను బలిగొంది.
ఆందోళనకారులు అదుపుతప్పడంతోనే వారిపైకి కాల్పులు జరపాల్సి వచ్చిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చెప్పారు. ఈ ఘటనలో 9 మంది మరణించడం విచారకరమన్న ఆయన దీనిపై పూర్తి స్థాయిలో న్యాయవిచారణ జరిపిస్తాన్నారు. కలెక్టరెట్ లోకి దుసుకునిపోవడానికి ప్రయత్నించడంతో పాటుగా పోలీసులపైకి రాళ్లు రవ్వారని, వారి వాహనాలను తగులబెట్టారని వారిని అదుపుచేయడానికి కాల్పులు జరపడం అనివార్యమయిందని ఆయన వివరించారు.
ప్రభుత్వ వైఫల్యం వల్లే తూత్తకూడి లో తొమ్మిది మంది అమాయకుల ప్రాణాలు పోయాయని డీఎంకే నేత స్టాలిన్ ఆరోపించారు. చాలా కాలంగా శాంతియుతంగా కర్మాగారానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తమ ఆరోగ్యాలు పాడువుతున్నాయంటూ స్థానికులు చేప్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్లే ఈ దారుణం జరిగిందన్నారు. అటు ప్రభుత్వ చర్యలు సినీ నటుడు కమలాసన్ తప్పుబట్టారు. చనిపోయిన వారంతా అమాయకులని కరడుగట్టిన నేరస్థులపై జరిగిపినట్టు వారిపై కాల్పులు జరపడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సొంత ప్రజలను కాల్చి చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.
లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత వేదాంత గ్రూప్ ఈ ఫ్యాక్టరీని నిర్వహిస్తోంది. ఇందులో 1000 మంది పనిచేస్తుండగా మరో 2వేల మంది తాత్కాలిక ఉద్యోగులున్నారు. తూత్తకూడి లో దాదాపు 25వేల మంది ఈ కంపెనీపై ప్రత్యక్షంగానో పరోక్షంగానే ఆధారపడి జీవిస్తున్నారు. కాలుష్యం వెదజల్లుతున్నా కంపెనీ నిర్వాహకలకు ఉన్న పలుకుబడితో కర్మాగారాన్ని నడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

copper smelting plant, s port city of Tuticorin, , Chief Minister E Palaniswami, judicial inquiry, local residents. protesting, sterlite protest, MK Stalin, Actor-politician Kamal Haasan, National Green Tribunal.

వైరల్ అవుతున్న దొంగల ముఠా వార్తలు-అబద్దాలు ప్రచారం చేస్తే జైలుకే
Thoothukudi