తిరుమల తిరుపతి దేవాస్థానంలో ఉద్యోగం-చర్చిలో ప్రార్థనలు

0
47

తిరుమల తిరుపతి దేవస్థానంలో సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో డిప్యూటీ ఇవో గా పనిచేస్తున్న ఒక అధికారిణి వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఏకంగా టీటీడీకి చెందిన అధికారిక వాహనంలోనే సదరు అధికారిణి స్నేహలత చర్చీకీ వేళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బంది ఇన్యమత ప్రచారం చేయడం కానీ ఆచరించడం కానీ చేయకూడదనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయినా సదరు మహిళ ఏకంగా తన అధికారిక వాహనంలోనే నిస్సంకోచంగా చర్చీకి వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
స్నేహలతపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఆమె తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా స్వీకరించరని అంటున్నారు. కార్యాలయానికి సైతం ఆమె వెనక ద్వారం గుండా మాత్రమే వస్తారని ముందు వైపు వేంకటేశ్వర స్వామి విగ్రహం ఉండడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. బ్రహ్మోత్సవ సమయాల్లోనే కొండపై కానుకలు స్వీకరించడానికి వెళ్లే సదరు అధికారిణి ఇతర సమయాల్లో కనిపించరనే ఫిర్యాదులున్నాయి.
తిరమల వేంకటేశ్వర స్వామి ఆదాయం పై నడిచే ధార్మిక సంస్థ టిటిడిలోనే ఉద్యోగులు అన్యమతాన్ని పాటించడం దారుణమని అంటున్నారు. హింధూ దేవుడిపై నమ్మకం లేని వారు మరి ధార్మిక సంస్థలో ఏ విధంగా ఉద్యోగం నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆమెను వెంటే పదవి నుండి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here