ట్రంప్ కు అరోగ్యపరీక్షలు

అమెరికా అత్యంత కీలకమైన జెరుసలేం ప్రకటన చదివిన సమయంలో అమెరికా అధ్యక్షుడి మాట తడబాటులో రకరకాల వదంతులు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యంపై అమెక వార్తలు షికార్లు చేస్తున్నాయి. ‘గాడ్‌ బ్లెస్‌ యునైటెడ్‌ స్టేట్స్‌’ అనాల్సిన ట్రంప్‌.. ‘గాడ్‌ బ్లెష్‌ యునైటెడ్‌ ష్టేట్స్‌’ అని పలికిన ట్రంప్ ఇదే ప్రసంగంలో పలు చోట్ల మాటలు తడబడ్డాయి. దీనిపై అమెరికాతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై వదంతులు మొదలయ్యాయి. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ వచ్చిన వార్తలను అమెరికా అధికారులు కొట్టిపారేశారు. అటువంటిది ఏమీలేదని అంటున్నారు.
మరో వైపు అమెరికా అధ్యక్షుడికి వైద్య పరీక్షలు జరపనున్నారు. దీనికి సంబంధించిన నివేదికను వెల్లడించనున్నారు. అయితే జెరుసలేం ప్రకటన సంయంలో జరిగిన దానికి ప్రస్తుత వైద్య పరిక్షలకు ఎటువంటి సంబంధం లేదని అధికారవర్గాలు తెలిపారు. నిబంధనల ప్రకారంమే అమెరికా అధ్యక్షుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడిగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ట్రంప్ రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సమయంలో నిబంధనలు అనుసరించి ఆయనకు వైద్య పరీక్షలు జరుపుతున్నట్టు ఆ వర్గాల భోగొట్టా.