కోదండరాం కు టీఆర్ఎస్ హెచ్చరిక

తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ఆచార్య కోదండరాం పై టీఆర్ఎస్ విమర్శల దుకూడును పెంచింది. కోదండరాంపై ఆచీతూచీ విమర్శలు చేస్తూ వచ్చిన టీఆర్ఎస్ మారిన పరిస్థితుల నేపధ్యంలో తీవ్ర విమర్శలకు దిగుతోంది. తెలంగాణ ఉధ్యమంలో కోదండరాం పాత్ర అసలు ఏమీ లేదని తెలంగాణ ఉధ్యమానికి కోదండరాం చేసింది ఏమీలేదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్, శాసన సభ్యులు ముతిరెడ్డి యాదగిరి రెడ్డి, చిన్నం దుర్గయ్య,రమేష్, దివాకర్ రావు లు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కోదండరాం పై విరుచుకుని పడ్డారు. టీఅర్ఎస్ ఏర్పాటు చేసిన వేదికల ద్వారానే కోదండరాం ఉద్యమాలను నిర్వహించారని అంతకు మించి మరేదీ కాదన్నారు.
కోదండరాం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏజెంటుగా పనిచేస్తున్నరాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంజెండాను ప్రచారం చేయడం తప్ప ప్రస్తుతం కోదండరాం చేస్తున్నది ఏమీ లేదని వారు ఆరోపించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నా ఒక పథకం ప్రకారం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న మంచి పనులు ఈ ఆచార్యుడికి కనిపించడం లేదని అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వపు పథకాలను దేశం యావత్తూ మెచ్చుకుంటోందని అటువంటి తరుణంలో తమ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించడం సరికాదన్నారు. కోదండరాం తన తీరును మార్చుకోని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా కోదండరాం ప్రభుత్వానికి మంచి సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధాంగా ఉన్నామని అయితే తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *