టీఆర్ఎస్ రహస్యం త్వరలో బద్దలవుతుంది : విజయశాంతి

తెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ ను ప్రశ్నించారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని విజయశాంతి అన్నారు. రెండేళ్ల క్రితం మియాపూర్ భూ కుంభకోణం వెలుగుచూసినప్పుడు మొత్తం రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేస్తానని కేసీఆర్ ప్రకటనలు గుప్పించారని కేశవరావును అప్పుడు బలిపశువును చేశారని విజయశాంతి ఫైర్ అయ్యారు . తమకు సన్నిహితంగా ఉన్నవారిని కాపాడి, బడుగు వర్గానికి చెందిన కేశవరావును బలి చేసి అప్పటి భూ వివాదాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం మియాపూర్ భూ కుంభకోణం పై చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆసక్తిగా చూశారని, టీఆర్ఎస్‌కు చెందిన బడా నేతలకు మియాపూర్ భూ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయని తేలడంతో రెవిన్యూ శాఖ ప్రక్షాళన అంశాన్ని కేసీఆర్ అటకెక్కించారని ఆమె పేర్కొన్నారు .
రెవిన్యూ శాఖను ప్రక్షాళన వెనుక ఉన్న రాజకోట రహస్యం త్వరలోనే బద్దలవుతుంది అని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు.