తెలంగాణలో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 16 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తం 11 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో రెండు ఏంపీటీసలను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా చేజిక్కించుకుంది. రెండు చోట్ల కాంగ్రెస్ నిజయం సాధించగా, మరో రెండు స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. మరో ఎంపీటీసీ ఎన్నిక ఏకగ్రీవం అయింది.
వనపర్తి జిల్లా గోపాల గిన్నే, కొమరం భీం ఆసీఫాబాద్ జిల్లా కోటల, నల్గొండ జిల్లా కిష్టాపురం, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ, ఖమ్మం జిల్లా కూసుమంచి, జక్కేపల్లి, భద్రాచలం ఎంపీసీటీ ఏడోస్థానాన్ని టీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, ఆచంపల్లిలో టీఆర్ఎస్ ఓడిపోయింది.