త్రిపురలో జోరుగా పోలింగ్

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 60 శాసనసభ స్థానాలు ఉన్న త్రిపురలో 59 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థి మృతి కారణంగా ఒక నియోజకవర్గంలో ఎన్నికను వాయిదా వేశారు. రాజధాని ఆగర్తలలో ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గత 25 సంవత్సరాలుగా త్రిపురలో సీపీఎం అధికారంలో ఉంది. దేశంలోనే అత్యంత నిరాడంబర ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ కు పేరుంది. ప్రజల్లో సీపీఎంతో పాటుగా మాణిక్ సర్కార్ కు గట్టిపట్టు ఉన్నప్పటికీ ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ నుండి తీవ్ర పోటీ ఎదురవుతోంది. త్రిపురలో అధికారంలోకి వచ్చి సీపీఎం ఆధిక్యానికి గండికొట్టాలని కంకణం కట్టుకుని బీజేపీ ఈ రాష్ట్రంపై గట్టిగానే దృష్టిపెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలకు తోడు ప్రధాని నరేంద్ర మోడి చరిష్మా ధ్వారా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ గట్టిగా కృషి చేస్తోంది. మార్చి 3వ తేదీన త్రిపుర ఎన్నికల ఫలితాలు రానున్నాయి.