బద్దలైన కమ్యూనిస్టుల కంచుకోట

కమ్యునిస్టుల కంచుకోట బద్దలయింది. త్రిపుర లో సీపీఎంకు ఎదురుగాలి వీస్తోంది. భారత్ లోనే అత్యంత నిరాండబర ముఖ్యమంత్రిగా పేరుగాంచిన మానిక్ సర్కార్ ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోటెత్తారు. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న త్రిపురలో 59 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ పాగా వేయడం ఖాయం. మొదటిసారిగా ఇక్కడ బీజేపీ అధికారంలోకి రానుంది. ప్రధాని మోడీ మ్యాజిక్ ఇక్కడ పనిచేసింది. నాలుగు దఫాలుగా ఎదురులేకుండా అప్రతిహతంగా విజయం సాధిస్తూ వస్తున్న సీపీఎం కు ఇది గట్టి ఎదురుదెబ్బే.