యూపీలో రైలు ప్రమాదం 10 మంది మృతి

0
46

ఉత్తర్ ప్రదేశ్ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. పూరీ-హరిద్వార్ ల మధ్య నడిచే కళింగ ఉత్కళ్ ఎక్స్ ప్రెస్ ఉత్తర్ ప్రదేశ్ లో ముజఫర్ నగర్ లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పది మంది ప్రణాలు కోల్పోగా 90 మందికి పైగా గాయాలన్నాయి. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఉత్కళ్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. 10 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియలేదు. బోగీలు ఒక దానిపై మరొకటి ఎక్కడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. పట్టాలు తప్పిన రైలు ట్రాక్ పక్కన ఉన్న ఇళ్లలోకి దూసుకుని పోయింది. దీనితో స్థానికులు కూడా గాయపడ్డారు. ఈ రైలు పూరీ నుండి హరిద్వార్ కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
రైలు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటుగా యూపీ సీఎం తీవ్ర దిగ్భ్రంతిని వ్యక్తం చేశారు. క్షతగ్రాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించడంతో పాటుగా ప్రమాదానికి గల కారణాలను అన్వేషించాలని ఆదేశాలు జారీ చేశారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here