హింధువులంటే అంత చులకనా…?

తిరుమల శ్రీనివాసుడు… ఆపేరు చెప్తేనే ప్రతీ భక్తుడు పులకరించిపోతాడు. నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివచ్చే తిరమల శ్రీనివాసుడి ఆలయ నిర్వహణను పర్యవేక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో బోర్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకం. భక్తులకు కల్పించే సౌకర్యాలు మొదలు ఆలయ నిర్వహణలోనూ బోర్డుదే తుది నిర్ణయం. అటువంటి అత్యంత కీలకమైన టీటీడీ బోర్డు సభ్యుల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉంది.
తిరుమల బోర్డు సభ్యుల, ఛైర్మన్ ల నియామకం రాజకీయ కోణంలోనే జరుగుతోంది. అనాదిగా కొనసాగుతున్న ఈ అనాచారంపై ఎంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేసినా వాటిని పట్టించుకునే తీరక, ఓపిక మన పాలకులకు ఏ మాత్రం లేదు. ఇప్పుడు ఏకంగా హింధువులకు అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులోకి ఇతర మతస్తులకి చోటు కల్పించడాన్ని బట్టి వారి చిత్తశుద్ది తెలుస్తోంది.
దీనిపై ప్రజల నుండి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నా పాలకులు మాత్రం కనీసం పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఎంపికైన ఎమ్మెల్యే అనిత బహిరంగంగానే తాను క్రైస్తవురాలినని చెప్పుకుంది. దీనికి సంబంధించి వీడియోలు కూడా ఇప్పుడు బయటికి వచ్చాయి. కనీసం ముందస్త విచారణ చేయకుండానే ప్రభుత్వం ఆమెను బోర్డు సభ్యురాలిగా నియమించారా అనే అనుమానాలు కలగక మానవు. అనితకు సంబంధించిన మతం గురించి తెలియక ఆమెను నియమించారా లేక తెలిసే ఈ దారుణానికి ఒడిగట్టారా అనే విషయం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఖచ్చితంగా ఉంది.
ఒక వేఖ ఆమె మతానికి సంబంధించి వివరాలు తెలియకుండా ఇట్లా చేసి ఉంటే అంతకన్నా దారుణం మరొకటి లేదు. టీటీడీ లాంటి అత్యంత ప్రాధాన్యం ఉన్న బోర్డు సభ్యుల నియామకంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టం అవుతోంది. ఒక వేళ తెలిసి తెలిసి క్రైస్తవురాలిని బోర్డు సభ్యురాలిగా నియమించారని అనుకుంటే అంతకన్నా పాపం మరొకటి లేదు. పాలకులు ఏంచేసిన గొర్రెమందల్లా తల ఊపుకుని తిరిగే హింధూ సమాజం దేనికైనా తలవంచుతుందనే ధీమాతో ఇట్లా వ్యహరించారని అనుకోవాల్సి వస్తుంది. ఇదే తరహాలో ఇరత మతాలకు సంబంధించిన కీలక పదవుల్లో ఆయా మతేతరులు ఉంచే ధైర్యం ప్రభుత్వాలు చేస్తాయా అంటే ఖచ్చితంగా చేయవు. ఒక వేళ అంత సాహసం ప్రభుత్వాలు చేస్తే వాటికి ఆయా మతస్తులు ఖచ్చితంగా తిగిన బుద్ది చెప్తారు.
హింధు సమాజం మాత్రం అట్లాంటివి పట్టించుకునే స్థితిలోనే లేదనిపిస్తోంది. తమ ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం బోర్డులో హింధువేతరులని నియమించినా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. హింధువల దేవాలయాలపై పెత్తనం చేస్తున్న ప్రభుత్వాలు వాటి ఆదాయాలను ఇతర అవసరాలు వినియోగిస్తున్నా ఏమీ పట్టనట్టు కూర్చున్న మనం ఇప్పుడు కూడా మనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తే తిరుమలలో జరిగేవి సుప్రభాత సేవలు కావు.
పవిత్ర తిరుమలలో అన్యమత ప్రచారం జోరుగా సాగుతోంది. దేవాలయ సిబ్బందిలోనే కొంత మంది ఇతర మతాల ప్రచారం చేస్తున్న సంగతి అనేక సార్లు వెలుగులోకి వచ్చింది. కోర్టు తీర్పులు, ఇతరత్రా కారణాలతో హింధువేతర సిబ్బంది విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండిపోయిన టీటీడీ బోర్డులోకి ఇతర మతస్తులను చొప్పించినా నోరుమూసుకుని కూర్చుంటే ఇంతకన్నా ధౌర్భాగ్యం మరొకటి లేదు.
దశాబ్దాలుగా సెక్యులక్ పాలకులు హింధు దేవాలయాల సంపతను కొల్లగొట్టారు. ఘజనీ, ఘోరీలకు ఏమాత్రం తీసిపోని విదంగా హింధువుల దేవాలయాల సొత్తును అప్పనంగా దిగమింగారు. దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు కోసం దేవాలయల నిధులు పక్కదారి పట్టించినా హింధు సమాజం మెల్కొన్న దాఖలాలు లేవు. చిన్ని నా బొజ్జకి శ్రీరామ రక్ష అన్న చందంగా వ్యవహరిస్తూ ఉండిపోవడం వల్లే ఈ స్థాయిలో అరాచకాలు చేసే ధైర్యం ప్రభుత్వాలకు వచ్చింది.
తమని తాము భక్తులు చెప్పుకునే వాళ్లు సైతం హింధువుల గొంతు నొక్కే ప్రయత్నాలే చేశారు. ఓట్లు తప్ప ఇతర అంశాలు ఏవీ పట్టించుకునే తీరకలేని నాయకులు హింధు దేవాలయాల బోర్డులను రాజకీయ ప్రయోజనాలకే వాడుకున్నారు. మెత్తగా ఉన్నవాడిని చూస్తే మొత్త బుద్దయినట్టు అన్యమతస్తులు ఏకంగా తిరుమల బోర్డు మెంబర్లుగా వచ్చేస్తున్నారు.
ఇప్పటికైన మెల్కోకపోతే తిరుమల గిరుల్లో వేంకటేశ్వర సుప్రభాతంతో పాటుగా ఇతర మతాల ప్రార్థనలు వినిపించినా ఆశ్చర్యం లేదు.
శిరీష బీ.ఎన్.ఎల్
(ఈ వ్యాసం పూర్తిగా రచయిత వ్యక్తిగత అభిప్రాయం)
tirumala, tirumala tirupati devasthanam, ttd, ttd board member, ttd board members, tirumala board members, venkateswara swami, tirumala venkateswara swami, srinivasudu.
తిరుమల తిరుపతి దేవాస్థానంలో ఉద్యోగం-చర్చిలో ప్రార్థనలు
Tirumala_Tirupati_Devasthanams