చిన్న శేషవాహనంగాపై శ్రీవారి ఊరేగింపు

తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆ దేవదేవుడు చిన్న శేష వాహనం పై ఊరేగాడు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే, చిన్న శేషవాహనాన్ని ‘వాసుకి’కి ప్రతీకగా భావిస్తారు. శ్రీ వైకుంఠనాధునికి ఆదిశేషువు తల్పం, తలగడ, ఎండవానల నుంచి రక్షించే ఛత్రం. నిత్యం స్వామిసేవలో ఉండే ఆదిశేషునిపై అనంతశయనుడిని వీక్షించడం ఎంతో పుణ్యదాయకమని భక్తుల అచంచల విశ్వాసం.
photos courtesy: TTD