తిరుమల శ్రీనివాసుడి ఆలయం లో అవకతవకలు?

0
102

తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యాలు చేశారు. శ్రీవారి ఆలయంలో అనాచార కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. సంప్రదాయాలను తీరుమల ఆలయం అధికారులు పక్కనపెట్టి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ రమణ దీక్షితులు పేర్కొన్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామికి ఉన్న వెలలేని అభరణాల వివరాలను భక్తుల ముందు ఉంచాలని ఆయన అన్నారు. 1996 వరకు అర్చకులు అధికారులకు అభరణాల లెక్కలు చూపించేవారని ఆ తరువాత పరిస్థితి మారిందని అధికారులే లెక్కలు చూసుకుంటున్నారని అన్నారు. అభారణాల లెక్కలను ఆలయ ప్రధాన అర్చకులు అడగడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. తిరుమల శ్రీనివాసుడికి ఎంతో మంది రాజులు, చక్రవర్తులు, ధనవంతులు అనాదిగా అభరాణాలను సమర్పిస్తూ వస్తున్నారు. వాటి విలువ లెక్కించడం కూడా సాధ్యం కానన్ని ఆభరాణాలు స్వామివారి సొంతం.
అటువంటి ఆభరణాల విషయంలో వివరాలు బహిర్గతం చేయాలంటూ తిరమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అధికారులను కోరడంపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2000 సంవత్సరాల నుండి తమ వంశానికి చెందిన వారితో పాటుగా యాదవ వంశస్తులు స్వామివారి సేవలో ఉన్నారని ఆలయంలో జరిగే వివిధ సేవల్లో తాము పాల్పంచుకుంటున్నామని అయితే అనాదిగా వస్తున్న ఆచారాలను తిరుమల శ్రీవారి ఆలయ అధికారులు పక్కనపెడుతున్నారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. స్వామివారి ఆలయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆయన ప్రకటించారు.
తిరుమల శ్రీనివాసుడి ఆలయంలో జరుగుతున్న విషయాలను గురించి వివరించడం కోసమే తాను ప్రజల ముందుకు వచ్చినట్టు రమణ దీక్షితులు చెప్తున్నారు.
tirumala, tirupathi, balaji, sri venkateswara swami, ramana dekshtulu,

Wanna Share it with loved ones?