తెలుగు టీవీ యాంకర్ ఆత్మహత్య | tv anchor commit suicide

0
86
తెలుగు టీవీ యాంకర్
ఆత్మహత్యకు పాల్పడిన తెలుగు టీవీ యాంకర్

తెలుగు టీవీ యాంకర్ గా పనిచేస్తున్న రాధిక (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాను నివాసం ఉంటున్న హైదరాబాద్ మూసాపేటల లోని సువీలా అపార్ట్ మెంటు ఆరో అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తెలుగు న్యూస్ ఛానల్ v-6లో ఆమె యాంకర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
తన చావుకు ఎవరూ కారణం కాదని తెలుగు టీవీ యాంకర్ తన సూసైడ్ నోట్ లో స్పష్టం చేశారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. నా మెదడే నా శత్రువు అందుకే ఆత్మహత్ చేసుకుంటున్నాను’ అని అమె తన సూసైడ్ నోట్ లో రాసిపెట్టి మరీ ఆత్మహత్యకు చేసుకున్నారు.
గత ఐదు సంవత్సరాల నుండి రాధిక గూడ్స్ షేడ్ రోడ్ లోని సువీలా అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఆమెతో పాటుగా తండ్రి, చెల్లులు, కుమారుడు నివసిస్తున్నారు. ఆరు నెలల క్రితం భర్త నుండి ఆమె విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఆదివారం రాత్రి 10.30 సమయంలో విధుల నుండి ఇంటికి వచ్చిన ఆమె పరుగున అపార్ట్ మెంట్ పై అంతస్తులోకి పరుగున వెళ్లడాన్ని అపార్ట్ మెంట్ వాసులు గుర్తించారు. అమె వెళ్లిన తీరును బట్టి అనుమానపడిన వారు ఆమె వెంట పైకి వెళ్లినప్పటికీ ఫలితం లేనట్టు తెలుస్తోంది. అప్పటికే ఆమె అపార్ట్ మెంట్ పై నుండి కిందకు దూకినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు.
భర్త నుండి విడాకులు తీసుకున్నప్పటికీ నుండి రాధిక తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. రాధికా ఆత్మహత్యతో స్థానికంగా విషాధ ఛాయలు అలముకున్నాయి.
తమ సహోద్యోగి అత్మహత్యకు పాల్పడడంపై వి-6 ఉద్యోగులు దిగ్భ్రంతి వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసులో చురుగ్గా ఉండే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే విషయాన్ని నమ్మలేకపోతున్నమని వారంటున్నారు.
telugu television V-6 news anchor Radhika (30) committed suicide by jumping from her appartment in moosapet.
She was suffering from depression. a suicide note was recovered from the spot.
tv anchor,V-6,telugug anchor,radhika,tv anchor radhika,tv anchor radhika redyy, radhika anchor,anchor radhika, anchor sucide,anchor radhika sucide.

Wanna Share it with loved ones?