తిరుగులేని టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురే లేకుండా పోయింది. ఎగ్జిట్ పోల్ అంచానాలకు మించి కారు జోరు కనిపించింది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 88 స్థానాలకు కైవసం చేసుకుని మూడింతల రెండు వంతుల మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ తెలంగాణలో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాకు మాత్రమే పరిమితం అయింది. టీఆర్ఎస్ ను గద్దె దింపేందుకు కూటమి కట్టిని కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐ లు టీఆర్ఎస్ కు ఏమాత్రం ధీటుగా నిలబడలేకపోయాయి. తెలుగుదేశం పార్టీ రెండు సీట్లను మాత్రమే దక్కించుకోగా తెలంగాణ జనసమితి, సీపీఐ లు ఖాతా కూడా తెరవలేని పరిస్థితి.
ఇటు 118 స్థానాలకు పోటీచేసిన బీజేపీ కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గోషామహన్ స్థానం నుండి రాజా సింగ్ మాత్రమే గెలుపొందగా మిగిలిన వారంత పారజం పాలయ్యారు. ఎఐఎం మాత్రం పాతబస్తీలో తన పట్టును నిలుపుకుంది. 7 స్థానాలను నిబెట్టుకుంది.