వచ్చే విద్యాసంవత్సరం నుండి తెలుగు తప్పనిసరి |Telugu compulsory

తెలుగు భాషాభిమానులకు శుభవార్త. వచ్చే విద్యాసంవత్సరం నుండి తెలంగాణలో తెలుగును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకుని రాబోతుంది. ఈ మేరకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకుని వస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును బోధించడం తప్పనిసరి. ప్రతీ పాఠశాలలోనూ ఒక సబ్జెక్టుగా బోధించాలని కేసీఆర్ పేర్కొన్నారు. మొదటి తరగతి నుండి 10 వ తరగతి వరకు ఇక తెలుగు తప్పనిసరి పాఠ్యాంశం కానుంది.
హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేదుకు ముందే తెలుగును తెలంగాణలో తప్పనిసరి సబ్జెక్టును చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రపంచ మహాసభల సమయంలోనూ కేసీఆర్ పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తమిళనాడులో అమలవుతున్న విద్యావిధానాన్ని రాష్ట్ర అధికారుల బృందం పరిశీలించింది. అక్కడ తమిళ భాషను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయంతో పాటుగా అమలవుతున్నతీరు, ఎదురవుతున్న ఇబ్బందులను గురించి ఆ బృందం పరిశీలించి ముఖ్యమంత్రికి నివేదించింది.

telangana, telangana news, telangana chief minister, telangana cm kcr, kcr, telugu, telugu subject.