దేశానికే ఆదర్శం – తెలంగాణ రాష్ట్రం

72వ స్వాతంత్ర్యదినోత్స వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
• సకల రంగాల్లో తెలంగాణ వేగంగా పురోగమిస్తుంది
• అతి తక్కువ కాలంలోనే అనూహ్యమైన ప్రగతిని తెలంగాణ నమోదు చేసింది.
• సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలన్ని నేడు పునరుత్తేజం పొందాయన్నాయి.
• రైతులందరికీ భరోసా కల్పించేందుకు రైతుబీమా పథకం.
• రైతు ఏ కారణంతో మరణించినా అతని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం
• రైతు మరణించిన పది రోజుల వ్యవధిలోనే ఆయన కుటుంబానికి భీమా సాయం.
• భారత జీవిత బీమా సంస్థ – ఎల్‌ఐసీ ద్వారా ఈ పథకం అమలు
• ప్రీమియం మొత్తాన్ని రైతుల తరపున ప్రభుత్వమే చెల్లిస్తుంది.
• యావత్ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాగా తెలంగాణ రాష్ట్రం.
• ప్రభుత్వం ఎంతో పరిణతితో వ్యవహరిస్తోంది.
• ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రస్థానం సాగుతోంది.
• వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేస్తున్నాం
• అణగారిన వర్గాలకు అండదండలు అందిస్తున్నాం.
• తెలంగాణ భవిష్యత్‌కు తగిన అభివృద్ధి ప్రాతిపదికలు
• తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచే దిశగా ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటోంది.
• రూ. 17 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశాం.
• ఇన్‌పుట్ సబ్సిడీలను తెలంగాణ ప్రభుత్వం సత్వరమే చెల్లించింది.
• నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు ముందులు విక్రయిస్తున్న వారిపై పీడీయాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
• . రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే
• గ్రామాల్లో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులకు సబ్సిడీపై వరినాటు యంత్రాల పంపిణీ
• భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూరికార్డుల ప్రక్షాళనను చేపట్టాం.
• 94 శాతం భూముల యాజమాన్యాల హక్కుల విషయంలో స్పష్టత వచ్చింది.
• భూరికార్డుల నిర్వహణలో పారదర్శకత కోసం ధరణి వెబ్‌సైట్‌కు రూపకల్పన చేశాం.
• పంట పెట్టుబడి పథకం కింద రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ. 8 వేలు ఇస్తున్నాం
• ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ఏటా రూ. 25 వేల కోట్లను ప్రభుత్వం కేటాయిస్తోంది.
• పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాం.

• గొల్లకుర్మలకు పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేశాం.

• రాష్ట్రంలో పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై 2.13 లక్షల మంది రైతులకు బర్రెల పంపిణీ చేస్తున్నాం.

• రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కోసం కావాల్సిన చేప పిల్లలను, రొయ్య పిల్లలను ప్రభుత్వమే సరఫరా చేస్తోంది.

తన పెళ్లి జరిగిపోయిందన్న రాహుల్ గాంధీ