వీవీఐపీ బందోబస్తుల్లో పోలీసు సిబ్బంది ఆకలి కేకలు

పోలీసు ఉధ్యోగం అంటేనే కత్తిమీద సాము. అందులోనూ కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి చెప్పనక్కరలేదు. బందోబస్తు విధులంటే పోలీసులకు నరకమే. గంటల తరబడి నడిరోడ్డు మీద ఎండనకా…వాననకా పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీవీఐపీ బందోబస్తు బాధ్యతలను నిర్వహించే పోలీసుల సమస్యలను గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జిల్లాల్లో వీవీఐపీ పర్యటనలు ఉన్న సమయంలో వారికి భద్రత కల్పించడంతో పాటుగా అడుగడునా పోలీసులను మోహరిస్తూ ఉంటారు. వారు ప్రయాణించే దారి పొడవునా బందోబస్తు ఉంటుంది. రోడ్లమీద విధులు నిర్వహించే వారికి సమయానికి అన్నపానీయాలు లభించడం అనేదే ఉండదు.
బందోబస్తుల్లో ఉన్న సిబ్బందికి ఆహార పంపిణీ గురించి ఎవరికీ పెద్దగా పట్టదు. వారిని పట్టించుకునే నాధుడే ఉండడు. పోలీసు ఉన్నతాధికారులు కూడా బందోబస్తు విధుల్లో బిజీగా గడుపుతుంటారు. ఇక కింది స్థాయి సిబ్బంది ఆకలి గురించి పట్టించుకునే తీరిక వారికుండదు. బందోబస్తు డ్యూటీల్లో ఉన్న వారికి ఆహారం సరఫరా జరగడం అనేది దాదాపుగా ఉండదు. బందోబస్తు విధుల్లో ఉన్నప్పుడు అక్కడి నుండి వెళ్లి తినివద్దామన్నా పరిస్థితులు చాలా అనుకూలించవు. దీని కడుపు మాడుతున్నా అక్కడి నుండి కదలకుండా ఉండాల్సిందే. మరి కొన్ని సందర్భాల్లో డబ్బులు పెట్టి ఏదైనా కొనుక్కుని తిందామన్నా దొరకని పరిస్థితి.
వీవీఐపీల పర్యటనల సందర్భంగా ఉండో బందోబస్తు, రోడ్ల మూసివేత, ఇతరత్రా హడావిడుల్లో చాలా మటుకు హోటళ్లతో పాటుగా రోడ్లపై ఆహారం విక్రయించే బండ్లు కూడా కనిపించవు. దీనితో ఆకలిసి నకనకలాడుతూ పోలీసులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తాగేందుకు గుక్కేడు నీళ్లు కూడా కరువే. ఇంతటి ప్రతీకూల పరిస్థితుల్లో పోలీసులు విధులను నిర్వహించాల్సి వస్తోంది.
అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వహించినా చాలా సార్లు అధికారుల నుండి తిట్లు తినక తప్పడం లేదని కింది స్థాయి సిబ్బంది వాపోతున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న సమయంలో కొద్ది సేపు అక్కడి నుండి కదిలినా తాఖీదులు తప్పడం లేదని ఎంతసేపయినా నీల్చునే ఉండాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. వీవీఐపీ ప్రర్యటన ముగిసిన తరువాత తినడానికి ఏమీ ఉండడం లేదని వారు చెప్తున్నారు.
మెదక్ జిల్లాలో గుప్పెడు మెతుకుల కోసం పోలీసులు పడుతున్న ఆరాట పడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కనీస భోజన సదుపాయాలా లేక పోలీసు సిబ్బంది పడుతున్న ఇబ్బందిని ఈ వీడియో కళ్లకు కట్టినట్టు చూపేట్టింది. బందోబస్తు విధులు పూర్తయిన తరువాత వారు భోజనం కోసం పడుతున్న ఆరాట చాలా మందిని కదిలిస్తోంది.
కనీసం ఇకనుంచైనా పోలీసు, ప్రభుత్వ పెద్దలు బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసుల ఆహార బాధ్యతలను చూడాలని పలువురు కోరుతున్నారు. ఆకలితో విధులు నిర్వహించడం వల్ల కొన్నిసార్లు పొరపాట్లు దొర్లే అవకాశం ఉందని కూడా వారంటున్నారు. భద్రతా విధుల్లో ఉండే వారి ఆకలికేకలు పట్టించుకుని దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది. శాంతిభద్రతల విధులు నిర్వహించే పోలీసులకు కనీస అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. మెదక్ లో ముఖ్యమంత్రి బందోబస్తు విధులు నిర్వహించిన పోలీసులు గుప్పెడు మెతుకుల కోసం పడుతున్న ఆరాటాన్ని మీరు చూడండి.

మచ్చబొల్లారం గోశాలను తెరిపించాలి:హింధు సంఘాల డిమాండ్Telangana_State_Police