తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి: కోదండరామ్

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. తమ పార్టీ తరుపున గవర్నర్ ను కలిసి రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా కోరతామన్నారు. కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడంపై కూడా కోదండరామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ వెంటనే కేసీఆర్ ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తొలగించి రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలన్నారు. టీఆర్ఎస్ అధినేతకు దమ్ముంటే ఆపద్ధర్మ పదవులను వదిలిపెట్టాలని సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దు చేసిన తరువాత కూడా పదవులను అంటిపెట్టుకుని వేలాడడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. గడువుకు ముందే అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో కేసీఆర్ ప్రజలను వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తన పరిపాలన గురించి గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీని గడువుకన్నా ముందే ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. మంచి పాలన అందించే వారు ఎవరూ ముందుగానే ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా అసెంబ్లీని రద్దు చేయరని అన్నారు. తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే అసెంబ్లీనీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కోదండరామ్ చెప్పారు. అసమర్థ, చేతకాని ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు జనసమితి కృషి చేస్తుందన్నారు. తమతో పాటు కలిసి వచ్చే పార్టీలు, వ్యక్తులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. తమ పార్టీ తరపున అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని కోదండరామ్ చెప్పారు.
telangana, telangana jana samithi, prof.kodanda ram.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే అసెంబ్లీ రద్దు: కేసీఆర్


నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్