ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి కేటీఆర్ కౌంటర్ | KTR Counter To Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ట్విట్టర్ లో గట్టి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్. ఏపీ ముఖ్యమంత్రి ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలపట్ల కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, నిధులకు సంబంధించిన అంశానికి సంబందందించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సెంటిమెంట్ తో నిధులు రావంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తూ సెంటిమెంటు వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారంటూ చంద్రబాబు ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించి కేటీఆర్ తెలంగాణ ప్రజల పోరాటాన్ని, త్యాగాలను తక్కువ చేసి మట్లాడవద్దంటూ చంద్రబాబుకు సూచించారు. తెలంగాణ ప్రజలు ప్యాకేజీలకోసం రాష్ట్రాన్ని కోరదలేదని తెలంగాణ రాష్ట్రం ఇక్కడి ప్రజల హక్కు అని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. మీ రాష్ట్ర హక్కులకోసం మీరు పోరాటం చేయడంలో ఎటువంటి తప్పులేదు కానీ మధ్యలో తెలంగాణను తక్కువచేసే విధంగా మాట్లాడడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అటు ఏపీ అసెంబ్లీలోనూ చంద్రబాబు నాయుడు తెలంగాణ సెంటిమెంటు అంశాన్ని ప్రస్తావించారు. సెంటిమెంటు వల్ల నిధులు రావని చెప్పిన అరుణ్ జైట్లీ సెంటిమెంటు కారణంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయంలో ఎన్డీఏ కూడా ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుపలికిన విషయాన్ని గుర్తుచేశారు.
KTR
‏Verified account
@KTRTRS
14h14 hours ago
More KTR Retweeted N Chandrababu Naidu
Sir, with all due respect we, the people of Telangana never flip-flopped in our demand for statehood. Never ever settled for any package even when many were offered
telangana,telangana state,telangana minister, ktr,kalvakuntla taraka ramarao, ktr, itminister ktr, andhra pradesh, chandrababu naidu,
You can fight for your rights but do not belittle and undermine the struggle & sacrifices of people of Telangana🙏
కేటీఆర్
ktr
trs
kcr
Gajwel


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *