telangana headlines report – ఆ ప్రాంతమంటే పోలీసులకే హడల్

telangana headlines special report : హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతం అది…. కరడుగట్టిన నేరగాళ్లకు, జేబు దొంగలకు, దొంగలకు నిలయం ఆ ప్రాంతం…నేరగాళ్లకు స్వరగధామం గా ఆ చోటు… అక్కడ ఉంటున్న వారిలో చాలా మంది నేరాలతో సంబంధం ఉన్న వారే… అయినా ఆ ప్రాంతం లోకపలికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకోవాలంటే పోలీసులే జంకుతారు. అదే నాంపల్లికి కూతవేటు దూరంలోని మంగర్ బస్తీ లేదా అప్జల్ నగర్. ఇరుకు సందులలతో నిండి ఉండే మంగర్ బస్తీలోకి వెళ్లడానికి పోలీసులే జంకుతారు. కొత్త వారు ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. అక్కడ నివాసం ఉండే వారు లేదా ఆ ప్రాంతం వారితో పరిచయం ఉన్న వారు తప్పిస్తే కొత్త వారు మంగర్ బస్తీలోకి వెళ్లడం సాధ్యం కాదు. కొత్తవారు ఎవరైనా వస్తే అనుమానపు చుపూలతో తరచి తరచి ప్రశ్నించడం ఏ మాత్రం అనుమానం వచ్చినా దాడిచేయడం వారి నైజం. మంగర్ బస్తీలోకి వెళ్లి నిందితులను అరెస్టు చేయడం పోలీసులకే సాధ్యం కాదు. అందుకే వారు బయటకు వచ్చే దాకా వేచి చూడడం మినహా పోలీసులకు మరో దారే లేదు.

ఆడవారే కీలకం: నేరాలకు పాల్పడి వచ్చే వారిని కాపడడంలో ఇక్కడి అడవారే కీలకంగా వ్యవహరిస్తారు. బస్తీలోకి వచ్చే పోలీసులను ముందుగా అడ్డుకునేది ఆడవాళ్లే, అందుకు వాళ్లు ఎంచుకునే పద్దతులు చాలా విచిత్రంగా, అసహ్యంగా ఉంటాయి. పోలీసులను అడ్డుకునే క్రమంలో వీరు చిన్న పిల్లలను కావులుగా వాడుకుంటారు. పోలీసుల ముందే పిల్లలను దారుణంగా కొట్టడం లేదా వారిపై కిరోసిన్ పోసి చంపేస్తామని బెదిరించడం చేస్తుంటారు. చిన్న చిన్న సందుల్లో మిద్దెలపైకి ఎక్కి ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపిస్తారు. తప్పించుకునే మార్గం లేక పోలీసులు దెబ్బలు తినాల్సిన పరిస్థితి. మంగర్ బస్తీలోకి వెళ్లడం అంటే ప్రాణాలపైకి తెచ్చుకోవడమే అని స్థానిక పోలీసులు చెప్తారు. పిల్లలను వాడుకుని పోలీసుల దాడులను నుండి బైట పడడంతో పాటుగా ఒక్కో సారి వీరి ప్రవర్తన మరీ శృతి మించుతుంది.

నగ్నంగా మారి పోలీసుల పై దాడి: తమ మొగవారిని పట్టుకునేందుకు వచ్చే పోలీసులను అడ్డుకునేందుకు ఇక్కడి మహిళలు కొందరు మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారని పోలీసులు చెప్తారు. పోలీసులు ఇంట్లోకి వస్తే ఒక్కసారిగా మహిళలు నగ్నంగా మారిపోతారారు. పోలీసులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ గగ్గోలు పెడతారు. దీనితో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు వెనుదిరగాల్సి వస్తుంది. గతంలో ఈ ప్రాంతంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించిన సమయంలో పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇతర ప్రాంతాలతో పోలీస్తే దాదాపు మూడు నుండి నాలుగు రెట్ల అదనపు బలగాలను మోహరించారు. పెద్ద ఎత్తున సివిల్ పోలీసులు రంగంలోకి దిగారు. అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకున్న తారువాతే పోలీసులు ఈ ప్రాంతంలో కార్టన్ సెర్చ్ నిర్వహించగలిగారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

 
హైదరాబాద్ పబ్ లు
nampally
/Mir_Osman_Ali_Khan
hyderabad house
Edwin_Lutyens