గవర్నర్ తో తెలంగాణ సీఎస్ భేటీ

ముందస్తు ఎన్నికలవైపు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. 6వ తేదీన క్యాబినెట్ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు సంబంధించిన స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రప్రభుత్వ అధికారుల్లో కూడా ముందస్తు ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. కే. జోషి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఈ భేటీకి కారాణాలు ఏమిటనే విషయాన్ని ఆయన వెల్లడించనప్పటికీ ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో ఈ భేటీకీ ప్రధాన్యం ఏర్పడింది. జోషీతో పాటుగా ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ కూడా గవర్నర్ ను కలిశారు.
ఇటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. దీనితో ముందుస్తు ఎన్నికల కు ప్రభుత్వం సిద్ధమైపోయినట్టే కనపిస్తోంది. అసెంబ్లీ రద్దుకు మొగ్గుచూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.