తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈరోజు సచివాలయంలో విడుదల చేశారు. తొలిసారిగా ఎంసెట్ పరీక్షను ఆన్ లైన్ లో ఈ నెల మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహించినందుకు జేఎన్టీయు అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం గత నాలుగేళ్లుగా విద్యారంగంలో చేపడుతున్న చర్యల వల్ల ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెరిగిందన్నారు. బయో మెట్రిక్, సీసీ కెమెరాలు, ల్యాబ్ పరికరాలు, 75శాతం తప్పనిసరి హాజరు ఉండాలన్న నిబంధనలతో ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రమాణాలు పెరిగాయని చెప్పారు.
ఈ ఏడాది నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ కు అధికారికంగా అనుమతినిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఒక కాలేజీలో ఒక కోర్సులో సీటు పొంది తర్వాత మారాలనుకుంటే అదే కాలేజీలో వేరే కోర్సులో సీటు ఖాళీ ఉంటే మారవచ్చని, గతంలో ఇంటర్నల్ స్లైడింగ్ కు ఫీజు రియింబర్స్ మెంట్ ఇచ్చేవారు కాదని, ఈ ఏడాది నుంచి వీరికి కూడా ఫీజు రియింబర్స్ మెంట్ వర్తిస్తుందని తెలిపారు.
ఇంజనీరింగ్ విభాగంలో 1, 47,958 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా, 1,36,305 మంది పరీక్షలకు హాజరయ్యారని, వీరిలో 1,06,646 మంది క్వాలిఫై అయ్యారని చెప్పారు. మొత్తంగా 78.24 శాతం మంది ఇంజనీరింగ్ లో క్వాలిఫై అయినట్లు ప్రకటించారు.
అగ్రికల్చర్ విభాగంలో 73,106 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 66,858 మంది పరీక్షలకు హాజరయ్యారని, వీరిలో 60,651(90.72శాతం) మంది క్వాలిఫై అయ్యారన్నారు.
జూన్ 8వ తేదీ నాటికి మొదటి దశ అడ్మిషన్లు పూర్తి అవుతాయని, జూలై మొదటి వారంలో రెండో దశ అడ్మిషన్లు పూర్తి చేస్తామని ఉఫ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం తరగతులు ఆగస్టు మొదటి తేదీ నుంచి ప్రారంభం అవుతాయని, ఈసారి తాము 15 రోజులు ముందకు జరిపి, జూన్ 16వ తేదీ నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో మొదటి పది ర్యాంకర్ల పేర్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చదివి, వినిపించారు. ఎంసెట్ ర్యాంకు కార్డులను ఈ నెల 22వ తేదీ నుంచి సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. eamcet.tsche.ac.in వెబ్‌సైట్ ద్వారా ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఈ కార్యక్రమంలో జేఎన్టీయు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, జేఎన్టీయు వీసీ వేణుగోపాల్ రెడ్డి, రిజిస్ట్రార్ యాదయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
telangana eamcet, eamcet, telangana, telangana eamcet results, kadiyam srihari, deputy chief minister, telangana engineering colleges, engineering colleges, college, engineering, eamcet ranks, telangana eamcet ranks, eamcet ranks in telangana, college of engineering, engineering colleges.

యడ్యూరప్ప తో రాజీనామా-బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం


యడ్యూరప్ప రాజీనామా
ఎంసెట్ ఫలితాల కోసం …