ముందస్తు ఎన్నికలకు వెల్లడం లేదు:కేసీఆర్

0
67
telangana cm

telangana cm తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుతాయంటూ జరిగిన ఊహాగానాలకు తెరపడింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయడంతో ముదస్తు ఎన్నికలంటూ జరిగిన ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది. షేడ్యూల్డ్ ప్రకారమే ఎన్నికల జరుగుతాయని ముందుగా ఎన్నికలకు వెళ్తామని తాను అనలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవరికివారు ఊహాగానాలు చేసుకున్నారు తప్ప ప్రభుత్వానికి మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని కేసీఆర్ తేల్చిచెప్పేశారు. ఎన్నికలు ముందుగానే జరుగుతాయని హడావిడిపడిన నేతలు ఈ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, పార్టీ ప్రముఖులతో జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. సర్వేల ద్వారా ప్రజల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెల్సుకుంటున్నట్టు చెప్పిన కేసీఆర్ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారన్నారు. ఎన్నికలకు ఆరు నెలల గడువున్నా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని, దీనికి అనుగుణంగా అందరినీ సమాయత్తం చేస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు.
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుండే టీఆర్ఎస్ నాయకులు ఎన్నికలకు సమాయత్తం కావాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ముఖ్యమంత్రి పార్టీ నాయకులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తేకుండా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్ శివార్లలన సెప్టెంబర్ 2 భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో నిర్ణయించినట్టుగా భారీ బహిరంగ సభ జరుగుతుందని స్పష్టం చేశారు. వర్షాలు ఇతరత్రా సమస్యల కారణంగా సభను వాయిదా వేస్తారంటూ జరిగిన ప్రచారాన్ని కూడా సీఎం తోసిపుచ్చారు. సభ అనుకున్న ప్రకారం జరుగుతుందని ఆయన తేల్చిచెప్పారు.

కేరళ వరదలకు కారణం- దేవుడి శాపమా..? మనిషి పాపమా…?


ఓ నిర్మాత అసభ్యంగా మాట్లాడాడు: ఆర్ఎక్స్ 100 హీరోయిన్

Wanna Share it with loved ones?