టీఆర్ఎస్ కు 106 సీట్లు వస్తాయి: కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 106 సీట్లలో విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రజలంతా టీఆర్ఎస్ నే నమ్ముతున్నారని రానున్న ఎన్నికల్లో పార్టీకి తిరుగులేదన్నారు. అయినా ఎమ్మెల్యేలు అంతా కష్టపడి చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ముగ్గురు, నలుగురికి తప్ప మిగితా వారందరికీ తప్పకుండా సీట్లను కేటాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభల పనితీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తమ పనితీరును వారు మార్చుకోవాల్సిందిగా సీఎం సూచించినట్టు సమాచారం.
ముస్లీం రిజర్వేషన్లకోసం అవసరం అయితే పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ముస్లీం రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ఆంశంపై ఢిల్లీకి వెళ్లి ఇతర రాజకీయపార్టీల ప్రతినిధులతో చర్చించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ శాసనసభ సమావేశాల అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నట్టు ఆయన చెప్పారు.

telangana,telangana cm, telangana cm kcr, kcr, trs,gangula kamalakar,muslim reservations.