తెలంగాణ దేవ భూమి:కేసీఆర్ |Ugadi Celebrations in kcr residence

తెలంగాణను దేవ భూమిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలను ఓకే విధమైన గౌరవమర్యాదలు ఉంటాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పంటలు సమృద్దిగా పండుతాయని, రైతులతో పాటుగా అన్నివర్గాల ప్రజలు సంతృప్తితో ఉంటారని చెప్పారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లోనూ ముందుకు తీసుకుని పోయేవిధంగా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. తెలంగాణకు అన్నీ శుభాలే ఉంటాయన్నారు.
ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి రాజకీయ నేతలు ఎవరికి వారు తమకు టికెట్ వస్తుందా రాదా అనే విషయంపైనే దృష్టిపెడుతున్నారని ప్రజల్లో ఉండేవారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని చెప్పారు. హైదారబాద్ లో ఉండి టికెట్ రావాలనుకుంటే రాదని ప్రజల్లో నిరంతరం తిరిగే వారికే ప్రధాన్యం ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
పంచాగానికి శాస్త్రీయత ఉందని ఆయన అన్నారు. గ్రహాస స్థితిగతులను ఎప్పటికప్పుడు చెప్పడం సామాన్యమైన విషయం కాదన్నారు. గ్రహాణాలు ఏసమయంలో వస్తాయనే విషయాన్ని నిమిషాలతో సహా ఖచ్చితంగా చెప్పగలగడం గొప్పవిషయమని అన్నారు. 50 సంవత్సరాల తరువాత ఏర్పడబోయే గ్రహణాలను గురించి ఇప్పుడే చెప్పడం ఆషామాషీ వ్యవహారం కాదన్నారు.
telangana,telangana cm, telangana news, telangana latest, telangana chief minister, telangana cm kcr, kcr, ugadi,Ugadi Celebrations, pragathi bhavan, kcr ugadi, kcr panchagam, ugadi panchamgam, ugadi at pragathi bhavan, telangna ugadi, ugadi in telangana state. Ugadi Celebrations in kcr residence.