తెలంగాణలో అరాచకాలను సహించం:కేసీఆర్

తెలంగాణలో అరాచకవాదాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల మొదటిరోజున గవర్నర్ ప్రసంగ సమయంలో చోటుచేసుకున్న పరిణామాల పట్ల కేసీఆర్ అగ్రాహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నిరసన తెలియజేయడానికి ఒక పద్దతి ఉంటుందని సభలో అరాచకాలు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శాసనసభతో పాటుగా బయటకూడా ఎవరైనా రాజకీయనాయకుల ముసుగులో అరాచకాలు చేస్తామంటే సహించేది లేదన్నారు. వారు ఎంతటివారైన ఖచ్చితంగా చర్యలు తీసుకుని తీరతామన్నారు. శాసనమండలి ఛైర్మన్ పై దాడి చేయడం ఎంతమాత్రం సహించరాని నేరమన్నారు. జరిగినదానికి పశ్చాతాప పడే బదులు గవర్నర్ పై హెడ్ ఫోన్స్ విసిరితే అవి మండలి ఛైర్మన్ కు తగిలినట్టుగా చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ శాసనసభకు ఇదో చీకటిరోజని కేసీఆర్ అన్నారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరుగుతున్నాయంటూ దేశవ్యాప్తంగా ప్రశంశలు వస్తున్న సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు రాష్ట్రానికే కళంకం తెచ్చేదిగా ఉందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆసహనంతో వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. రాజకీయంగా ఎటూ నెగ్గలేమని తెలుసుకుని తనపై వ్యక్తిగతంగా చెడు ప్రచారం చేస్తున్నారని. తన ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తాను అమెరికాలో వైద్యం తీసుకునేందుకు వెళ్తున్నట్టు నాలుగు సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పూర్తిగా ఓడిపోయిందని ప్రజలు వాళ్లకు ఎన్నిసార్లు బుద్దితెప్పినా వారి ప్రవర్తనలో మార్పురావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతూనే ఉన్నా వాళ్లకు బుద్దిరావడంలేదన్నారు.
telangana, telangana chief minister, telangana cm kcr, telangana assembly, assembly speaker, swamy goud, congress party, telangana congress party, komatireddy venkat reddy


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *