ముగిసిన క్యాబినెట్ భేటీ-కీలక నిర్ణయానికి మరికొంత సమయం

ప్రగతి నివేదన సభకు ముందు జరిగిన మంత్రివర్గ సమావేశం ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసింది. ముఖ్యమమంత్రి చంద్రశేఖర్ రావు అధ్యక్షత జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలోనే అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయవచ్చంటూ జరిగిన ఊహాగానాలకు తెరదింపుతూ అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిర్ణయాలను మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. అయితే త్వరలోనే మరో మంత్రివర్గ సమావేశం ఉంటుందని ప్రకటించడం ద్వారా అసెంబ్లీ రద్దుపై ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి వర్గ సమావేశ వివరాలను సీనియర్ మంత్రులు కడియం శ్రీహరి, హరీష్ రావు, ఈటెల రాజేందర్ లు మీడియాకు వివరించారు.
మంత్రి వర్గ నిర్ణయాలు
• బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు.. వీటికోసం గాను 71 ఎకరాలు, 70కోట్ల రుపాయల కేటాయింపు.
• రెడ్డీ హాస్టల్ భవనానికి మరో ఐదు ఎకరాల కేటాయింపు.
• . గోపాల మిత్రల గౌరవ వేతనాన్ని రూ.3,500 నుంచి రూ.8,500లకు పెంపు.
• అర్చకుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచాల్సిందిగా నిర్ణయం.
• కంటి వెలుగు కార్యక్రమంపై కేబినెట్‌ సంతృప్తి
• ఎన్‌యూహెచ్‌ఎంలో పనిచేస్తున్న 9వేల మందికి కనీస వేతనాల పెంపు.
telangana,telangana cabinet,telangana cabinet meeting, kcr, telangana cm.