తెలంగాణాకు భారీగా నిధులిచ్చాం: స్మృతి ఇరానీ

0
72
telangana bjp.

telangana bjp తెలంగాణ అభివృద్ధికోసం 14వ ప్రణాళికా సంఘం 2.30లక్షల కోట్లు ఇచ్చిందని, ఇదే 13వ ఆర్థిక సంఘం కేవలం 15వేల కోట్ల రపాయలు మాత్రమే ఇచ్చిందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. మెదక్‌ జిల్లా చేగుంటలో ఏర్పాటు చేసిన భాజపా మహిళా శంఖారావ సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వ చిత్తశుద్దికి ఇదే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. పెద్ద ఎత్తున తెలంగాణకు నిధులు ఇస్తున్నా టీఆర్ఎస్ సర్కారు మాత్రం కేంద్రం నుండి నిధులు రావడం లేదని అసత్య ప్రచారం చేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు తెలంగాణ అభివృద్దికి కంకణం కట్టుకున్నారని ఇందుకోసమే పెద్ద ఎత్తున నిధులను కేంద్రప్రభుత్వం ఇస్తోందన్నారు. లోక్ సభతో పాటుగా ఎన్నికలు వస్తే ఓడిపోతామనే భయంతోనే తెలంగాణ ప్రభుత్వం గడువుకన్నా ముందే అసెంబ్లీని రద్దు చేసిందని ఆమె అన్నారు. ముందుగానే ఎందుకు అసెంబ్లీని రద్దుచేశారనే విషయంపై కేసీఆర్ స్పష్టమైన సమాధానం చెప్పడంలేదని ఆమె విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది తెలంగాణ ప్రజలని, అమరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. నాడు తెలంగాణ సాయుధపోరాట యోధులు తమ ప్రాణాలకు తెగించి నిజాం నుండి విముక్తి పొందారని అటువంటి వారి త్యాగాలను స్మరించుకునేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం జంకుతోందన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడంలేదని, ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో ఎందుకు చేరడం లేదో కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 24 గంటల విద్యుత్ కేంద్ర ప్రభుత్వం ఘనతేనని, మిషన్ భగీరథ, జాతీయ దహదారుల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం సహకరించిందన్నారు. బీడీ కార్మికుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనికోసం గాను 80లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చినట్టు ఆమె వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళకోసం చేసింది ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కనీసం ఒక్క మహిళకు కూడా కెబినెట్ లో కేసీఆర్ స్థానం కల్పించలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే మహిళా పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పొదుపు సంఘాలకు రూ.10లక్షలు వడ్డీలేని రుణం ఇస్తామని ప్రకటించారు. వితంతువులకు రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

telangana bjp.

భర్తనే కోల్పోయాను… ధైర్యాన్ని కాదు… : వీరజవాను భార్య


భర్తనే కోల్పోయాను… ధైర్యాన్ని కాదు… : వీరజవాను భార్య

Wanna Share it with loved ones?