కమలం నేతలకు ముందస్తు గుబులు

telangana bjp టీఆర్ఎస్ కు తాము మిత్రపక్షం కాదని బీజేపీ నేతలు మరోసారి స్పష్టం చేశారు. గులాబీ పార్టీని తాము విపక్షంగానే చూస్తున్నాము తప్ప వారితో పొత్తు పెట్టుకునే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని కమలనాధులు తెల్చిచెప్తున్నారు. టీఆర్ఎస్-బీజేపీలు ఓకే గూటిపక్షలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ నాయకులు తిప్పికొడుతున్నారు. తమకు గులాబీ పార్టీతో ఎట్లాంటి రాజకీయ అవగాహనలేదనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో మాత్రం రెండు పార్టీలు లోక్ సభ ఎన్నికలనాటికి కలిసిముందుకు వెళ్తాయనే ప్రచారం బలంగా ఉందని దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం బీజేపీ నేతల్లో గట్టిగా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే దానికి కల కారణాలను ప్రజలకు వివరించాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంద్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర మంత్రులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసినంతమాత్రానా టీఆర్ఎస్ తో ఎన్నికల అవగాహనకు వచ్చినట్టు కాదని ఆయన పేర్కొన్నారు.
అయితే తెలంగాణ బీజేపీ నేతలను మాత్రం భయం వీడడం లేదు. ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమనే సంకేతాలు వస్తుండడంతో పాటుగా పార్టీ అధిష్టానం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించడం కమలం పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికలకు ఆ పార్టీ ఇంకా సిద్ధంగా లేదు. రాష్ట్రంలో బలం పుంజుకుంటున్న సమయంలో ఎన్నికలకు వెళ్లాల్సిరావడం ఇబ్బందికర పరిణామమేనని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు అంగీకరిస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా వ్యవహరిస్తోందనే ప్రచారం వల్ల తమకు లాభం కన్నా నష్టమే ఎక్కువ కలిగిస్తోందని పార్టీనేతలు చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటుగా టీఆర్ఎస్ ను వ్యతిరేకించేవారి ఓట్లు తమకు పడకుండా పోయే ప్రమాదం ఉందని దీనికి తోడు ఓటూ టీఆర్ఎస్ అభ్యర్థులు అన్నిచోట్లా పోటీలో ఉంటారు కనుక ఆ పార్టీకి పడే ఓట్లు వారికే పడతే తమ పరస్థితి రెండిటికీ చెడ్డ రేవడిలాగా తయారవుతుందని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు.
కేవలం అసెంబ్లీకి మాత్రమే ఎన్నికలు జరిగితే మోడి ప్రభావం ఎక్కడా కనిపించదని వారే ఒప్పుకుంటున్నారు. తాము బలంగా ఉన్న చోట్ల కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు పడే అవకాశాలు లేకుండా పోతాయనే భయం కమలనాధులను వెంటాడుతోంది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకుని పోటీచేసిన బీజేపీ ఇప్పుడు వారికి దూరం అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగాల్సిన పరిస్థితి. లోక్ సభ ఎన్నికలతో పాటుగా ఆసెంబ్లీకీ ఎన్నికలు జరిగితే జాతీయ రాజకీయాలతో పాటుగా మోడీ ప్రభావం బాగా కనిపించేదని ప్రస్తుతం ఆ అవకాశాలు కనిపించడంలేదని బాధ కనిపిస్తోంది.
ముందస్తు ఎన్నికలకు తెలంగాణ బీజేపీ ఏమాత్రం సుముఖంగా లేదు. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకుని వచ్చి అసెంబ్లీని రద్దుచేసినప్పటికీ ముందస్తు ఎన్నికలు జరక్కుండా చూపాలని బీజేపీ రాష్ట్రా నాయకులు సూచించినా ఆ ఆస్కారం లేదని ఎన్నికలు జరక్కుండా చూడడం తమ పరిధిలోలేదని వారు తేల్చిచెప్పినట్టు సమాచారం.
telangana bjp, bjp, bharatiya janata party, trs, telangana rashtra samithi.

ప్రగతి నివేదన సభ నుండే ఎన్నికల శంఖారావం?


ఎందుకీ ముందస్తు… అసలు కారణాలు ఏంటి?