తెలంగాణ అసెంబ్లీలో రభస

సోమవారం తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. చట్టసభల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవచం పూర్తిగా అవాంఛనీయ పరిణామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విసిరిన హెడ్ ఫోన్ తగిలి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం అయిన ఘటనకు సంబంధించి అన్ని వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఆదర్శంగా నడుస్తుందని గతంలో అన్ని వర్గాల నుండి వచ్చిన ప్రశంశలకు భిన్నంగా జరిగిన ఈ ఘటన తెలంగాణ అసెంబ్లీ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఎన్నికల ముందుగు అసెంబ్లీ సమావేశాలు వాడిగా వేడిగా జరగడం సహజమే. ప్రభుత్వ విధానాలపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తే అధికార పక్షం తాము చేసిన పనులను గురించి చెప్పుకుంటుంది. ఎన్నికల వేళ సహజంగానే రెండు వర్గాలు ఎదుటి వారిపై పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆవేశాలు, సవాళ్లు, ప్రతి సవాళ్ళను దాటి పరిస్థితి చేరుకోవడం మాతరం సరికాదు.
కాంగ్రెస్ సభ్యుల చర్య ఎంత మాత్రం సరికాదని అధికార పార్టీ అంటోంది. విపక్షాలు బౌతిక దాడులకు దిగారని మండిపడుతున్న అధికార పక్షం దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలకు సిద్దపడుతోంది. అయితే అధికార పక్షం వ్యవహరించిన అణచివేత తీరువల్లే ఈ పరిస్థితి వచ్చిందనేది విపక్ష కాంగ్రెస్ వాదన. అసెంబ్లీనీ పూర్తిగా మార్షల్స్ తో నింపివేశారని వారు ఆరోపిస్తున్నారు.

telangana,telangana assembly, telangana governor, telangana chief minister, trs, swamy goud, mlc,mla,komati reddy venkat reddy,congress leaders.