నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్

telangana assembly elections తెలంగాణలో నవంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీని రద్దు చేసినతరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ లో రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఛత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటుగా తెలంగాణకు కూడా ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తనకున్న సమాచారం మేరకు నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయన్నారు. అక్టోబర్ మాసంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని నవంబర్ లో ఎన్నికలు జరిగి డిసెంబర్ కల్లా ఫలితాలు వెడువడతాయన్నారు.
హుస్నాబాద్ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. శ్రావణ శుక్రవారం మంచి రోజుని అందుకనే ఆ రోజున ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నట్టు కేసీఆర్ పేర్కొన్నారు. 9వ తేదీ తరువాత పితృపక్షాలు మొదలవుతున్నాయని అవి అంతమంచిరోజులు కావు కాబట్టి మంచిరోజుల్లోనే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.
ఎన్నికల సంఘం రాజ్యాంగపరిధిలో పనిచేస్తుందని చెప్పిన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నికల సంఘంతో అధికారులు చర్చించారని అన్నీ పద్దతి ప్రకారం నడుచుకుని అసెంబ్లీని రద్దు చేశామన్నారు. 105 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించామని చెప్పిన కేసీఆర్ అభ్యర్థులు ఎవరి పనులు చేసుకోవాలని సూచించారు.

అమ్మాయిల బాత్రూంలలో రహస్య కెమేరాలు