తెలంగాణ అసెంబ్లీ రద్దు

Telangana Assembly Dissolved తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వీలుగా అసెంబ్లీనీ రద్దుచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొద్దిసేపటి క్రితం సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు ఏకవ్యాఖ్య తీర్మానాన్ని ఆమోదించింది. గత కొద్దిరోజులుగా అసెంబ్లీ రద్దుకు సంబంధించి వచ్చిన వార్తలు మొత్తానికి నిజమయ్యాయి. వివిధ రాజకీయ పరిణామాలు, పరిస్థితులను బేరీజు వేసుకున్న తరువాత ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగర శివార్లలోని కొంగర్ కలాన్ లో భారీ భహిరంగ సభను ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ గత నాలుగు సంవత్సరాల్లో తెలంగాణలో చేసిన అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.
గత రెండు రోజులుగా అసెంబ్లీ రద్దుకు సంబంధించిన సాంకేతిక అంశాలను పూర్తిచేసిన ప్రభుత్వం నేడు మంత్రివర్గ సమావేశంలో ఏక వ్యాఖ్య తీర్మానం ద్వారా అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని గవర్నర్ నరసింహన్ కు ఇవ్వనున్నారు. అటు తరువాత ప్రభుత్వ తరపున లాంఛనాలు పూర్తయిన తరువాత అసెంబ్లీ రద్దు సమాచారాన్ని ఎన్నికల సంఘానికి అందచేస్తారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశాన్ని ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అసెంబ్లీ రద్దయిన తరువాత ఆరు నెలల లోపు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటివరకు కేసీఆర్ తో పాటుగా ఆయన మంత్రివర్గ సహచరులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మంత్రులుగా కొనసాగుతారు.

ఎందుకీ ముందస్తు… అసలు కారణాలు ఏంటి?


కమలం నేతలకు ముందస్తు గుబులు