6వ తేదీ అసెంబ్లీ రద్దు?

telangana assembly dissolve తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారయిందా అంటే అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. గురువారం అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రి వర్గం తీర్మానం చేయబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహిత వర్గాల సమాచారం. ఆరవతేదీన ఉదయం ఆరు గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని అందులో 6. గంటల 45 నిమిషాలకు అసెంబ్లీ రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదిస్తారని తెలుస్తోంది. ముహూర్తాలను, అదృష్ట సంఖ్యను గట్టిగా నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సమయానికే అసెంబ్లీని రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.కేసీఆర్ కు ఆరు (6) ను అదృష్ట సంఖ్యగా భావిస్తారు. అందుకోసమే ఆరవతారీఖున మంత్రివర్గ సమావేశం జరుతోంది.
అసెంబ్లీని రద్దు చేయడం దాదాపుగా ఖరారయిపోవడంతో మంత్రులంతా బుధవారం సెప్టెంబర్ 5 తేదీ రాత్రి కల్లా హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలనే అదేశాలు అందాయి. పెండింగ్ లో శంఖుస్థాపనలు, ప్రారంబోత్సవాలను బుధవారం కల్లా పూర్తి చేయాలని మంత్రులకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. అటు ఎమ్మెల్యేలకు కూడా దీనిపై సమాచారం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ రద్దయిన తరవాత ఉండే ఆపద్ధర్మ ప్రభుత్వానికి పరిమిత సంఖ్యలోనే అధికారులు ఉంటాయి. ఈ నేపధ్యంలో కీలకమైన పలు ఫైళ్లను బుధవారం కల్లా పూర్తి చేస్తున్నారు. అధికారులు అఘామేఘాల మీద ఫైళ్లను క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు.
అసెంబ్లీని రద్దు చేస్తే ఏర్పడే పరిణామాలు, దాని వల్ల కలిగే లాభనష్టాలను గురించి మంగళవారం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలోని ముఖ్య నేతలతో పాటుగా అంతరంగీకులు, సలహాదారులు, రాజకీయ విశ్లేషకులతో మరోసారి మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ రద్దు చేసిన తరువాత ఎటువంటి పరిణామాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఎన్ని రోజుల్లో ఎన్నికలు రావచ్చు అనే అంశాలతో పాటాగా ఒక వేళ ఎన్నికలు ఆలస్యంగా జరిగేతే ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి అనే విషయాలపై కూడా ఆయన కూలంకశంగా చర్చించినట్టు సమాచారం.
అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ముఖ్యమంత్రి వద్ద ఉందని ఆయన ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే ఏ నిర్ణయమైన తీసుకుంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ రద్దు వంటి కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఆషామాషీగా తీసుకోలేదని దీని వెనుక భారీ రాజకీయ ఎత్తుగడే ఉందనేది వారి అభిప్రాయం.
telangana,telangana cm, telangana cm kcr, telangana government, telangana government dissolve.

7న హుస్నాబాద్ లో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ


గవర్నర్ తో తెలంగాణ సీఎస్ భేటీ