తెలంగాణ అసెంబ్లీ లో మరో ఇద్దరి సభ్యతాలు రద్దు?| Telangana Assembly

తెలంగాణ అసెంబ్లీ లో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు సభ్యుల శాసనసభ సభ్యత్వాలు రద్దయ్యాయని మరో ఇద్దరి సభ్యత్వాలు కూడా రద్దుచేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అసెంబ్లీలో హుందాగా ప్రవర్తించాలని అన్నారు. ఇష్టం వచ్చినట్టు నడుకుంటామనంటే కుదరని కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీతో పాటుగా బయటకూడా ఎక్కడపడితే అక్కడ ధర్నాలు చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. ధర్నా చౌక్ లో ఆందోళనలపై ఉన్న నేషేదం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. సరూర్ నగర్ లో ధర్నాలకోసం స్థలాన్ని కేటాయిస్తామంటే విపక్షాలు వద్దంటున్నాయని అన్నారు.
తెలంగాణను అన్నిరకాలుగా నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని కేసీఆర్ ఆరోపించారు. 1956 నుండి తెలంగాణ బ్రష్టుపట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రదానకారణమన్నారు. తెలంగాణ కోసం ఉధ్యమించిన 400 మందిని కాల్చి చంపిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని తాము తెచ్చామని చెప్పడం దారుణం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వవద్దని కాంగ్రెస్ నాయకులు నాటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బ్రస్టుపట్టించిన కాంగ్రెస్ ఇప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోతోందని చేస్తున్న విమర్శలను కేసీఆర్ తిప్పికొట్టారు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్రానికి 72వేల కోట్ల రూపాయల అప్పు ఉందని ఆ తరువాత వివిధ సంక్షేమ పథకాల కోసం చేసిన అప్పులు అన్నీ కలుపుకుంటే 1.42లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టు కేసీఅర్ వివరించారు.

telangana, telangana assembly, telangana cm, telangana cm kcr, congress pary, telangana congress, telangana headlines, telangana news,telangana latest, telangana latest news.
ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు
తెలంగాణ అసెంబ్లీ
సిరికొండ మధుసూధనాచారి
భూపాలపల్లి నియోజక వర్గం
భూపాలపల్లి