తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

తెలంగాణ రాష్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనుకున్నట్టుగా బడ్జెట్ సమావేశాల తొలిరోజునే సభలో రభస జరిగింది. అసెంబ్లీ ప్రారంభం అయిన తరువాత గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం అయిన కొద్ది సేపటికే విపక్ష కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ స్థానాల నుండి లేచివచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. కాంగ్రెస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్తితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనితో కాంగ్రెస్ సభ్యులు మరింత గట్టిగా నినాదాచేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కొంత మంది సభ్యులు గవర్నర్ ప్రసంగపాఠాప్రతులను చించివేశారు.
సభలో కాంగ్రెస్ సభ్యులు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆదివారం జరిగిన టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో చెప్పడం గమనార్హం. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బడ్జెట్ సమావేశాల్లో తమ వాణిని గట్టిగానే వినిపించే ప్రయత్నం చేస్తోంది. అధికార పార్టీ విపక్షాలను అణగదొక్కుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ సభ్యులు టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుని పడుతున్నారు.
telangana,telangana assembly, trs,congress,telangana congress, telangana congress party, kcr,telangana governor, governor for telangana and andhra pradesh, e.l.narasimhan, el narasimhan,narasimhan,governor narasimhan.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *