టీడీపీ శ్రేణుల సంబరాలు

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకుని పోతుండడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నంద్యాల ఉప ఎన్నికల పోరులో గెలుపుపై మొదటి నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భారీ ప్రచారం నిర్వహించడంతో పాటుగా నంద్యాలలో మంచి పట్టున శిల్పా మోహన్ రెడ్డి అభ్యర్థి కావడంతో మెజార్టీపై పార్టీ కార్యకర్తల్లో కొద్ది సందేతహాలు నెలకొన్నాయి. ఎన్నికల రోజున భారీ పోలింగ్ జరగడంతో పాటుగా మొదటి నుండి తెలుగుదేశం పార్టీ కొద్ది వెనకంజలో ఉన్నట్టు కనిపించిన నంద్యాల రూరల్ లో భారీ ఓట్లు పోలవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొద్దిగా కలవర పడ్డారు. అయితే వారి భయాలు అన్నీ ఈవీఎంలు తెరిచిన వెంటనే పటాపంచలు అయ్యాయి. అటు రూరల్ తో పాటుగా అర్బన్ లోనూ తెలుగుదేశం పార్టీ సత్తా చాటడంతో పాటుగా భారీ మెజార్టీ దిశగా దూసుకుని పోతుండంతో తెలుగుదేశం పార్టీ కార్యర్తలు ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు.
కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటుగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద కూడా సందడి వాతావరణం కనిపించింది. టీడీపీ కార్యకర్తలు బాణా సంచా కాలుస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. తమ నేత చంద్రబాబు చేస్తున్న అభివృద్దికి ఇదే నిదర్శనమని విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంత ప్రయత్నించిన కనీసం మెజార్టీని కూడా తగ్గించలేకపోయిందని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి భారీ విజయం ఖరారు కావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *