నిర్ణయాత్మక శక్తిగా బ్రాహ్మణ ఓటర్లు:తులసీ శ్రీనివాస్

0
87
tbsss

tbsss
tbsss బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఏ పార్టీ తరపున పోటీచేసినా సరే వారి గెలుపుకోసం శాయశక్తులా కృషిచేస్తామని, రానున్న ఎన్నికల్లో బ్రాహ్మణ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కార్యచరణను రూపొందించుకుంటున్నామని తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య ( TBSSS ) జంటనగరాలు, పూర్వపు రంగారెడ్డి జిలాల్ల అధ్యక్షుడు తులసీ శ్రీనివాస్ తెలిపారు. సమాఖ్యకు పూర్తి స్థాయి కార్యనిర్వాహక బృందాన్ని నియమించిన సందర్భంగా “తెలంగాణ హేడ్ లైన్స్” తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తామని అన్నారు. జంటనగరాలతోపాటుగా శివార్లలోని 27 నియోజకవర్గాలకు గాను పాతబస్తీలోని అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. వీరందరినీ ఒక్కతాటిపైకి తీసుకుని వచ్చేందుకు కసరత్తులు ప్రారంభించామని అన్నారు. తమ సామాజిక వర్గానికి చెందినవారు పోటీలో లేని పక్షంలో తమకు న్యాయం చేసే, సమస్యలను పరిష్కరించే అభ్యర్థులకు మద్దతు పలుకుతామన్నారు.
బ్రాహ్మణ ఓటర్లకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని, దీనికోసం గాను క్షేత్ర స్థాయిలో తమ బృందాలు పర్యటిస్తున్నాయని చెప్పారు. కాలనీల్లో చిన్న చిన్న సమావేశాలను ఏర్పాటు చేయడం ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గ ఓటర్లందిరినీ కలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తులసీ శ్రీనివాస్ వెల్లడించారు. జంటనగరాలు, శివారు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని వెంటనే ప్రతీ ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో పరిశీలించుకోవాలని లేని పక్షంలో వారివారి పోలింగ్ బూత్ లలో గానీ, ఆన్ లైన్ లో గానీ పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు.
అన్ని రాజకీయ పార్టీలు బ్రాహ్మణులకు వీలైనన్ని ఎక్కువ సీట్లను కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేసే పార్టీలు దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని తులసీ శ్రీనివాస్ హెచ్చరించారు. చాలా నియోజక వర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తి తమ సామాజిక ఓటర్లకు ఉందన్నారు. రాజకీయ పక్షాలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. బ్రాహ్మణులకు ఖచ్చితంగా సముచిత స్థాయిలో సీట్లను ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
బ్రాహ్మణులు పేరుకే అగ్రకులంగా మారారని, ఉద్యోగాలు లేక ఉపాధి దొరక్క యువకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పేదరికంలో మగ్గుతున్న బ్రాహ్మణ కుటుంబాలు అనేకం ఉన్నాయని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే కోరికలు తీర్చుకోగలిగే శక్తి వస్తుందని దీనికోసం బ్రాహ్మణ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో సంఘటితంగా శక్తిని చాటాల్సిన సమయం ఆసన్నమైదని తులసీ శ్రీనివాస్ పేర్కొన్నారు.
tbsss, tulasi srinivas, brahmin,brahmin voters, hyderabad, brahmana seva sanghala samakhya,

మీడియా ముందుకు ప్రణయ్ హత్యకేసు నిందితులు


మీడియా ముందుకు ప్రణయ్ హత్యకేసు నిందితులు

Wanna Share it with loved ones?