తమిళనాడులో బ్రాహ్మణులకు జరిగిన అవమానంపై ఆగ్రహం

0
15

తమిళనాడులో బ్రాహ్మణుల పట్ల తంతై పెరియార్ ద్రవిడ కజగం (టిపీడీకే) వ్యవహరించిన తీరుపై అక్కడి బ్రాహ్మణ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. బ్రాహ్మణులను చుట్టుముట్టి వారి జంధ్యాలను తెంపిన ఘటనపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెల్లురు జిల్లాలో పెరియార్ విగ్రహానికి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు చేసిన అవమానంతో రెచ్చిపోయిన టీపీడీకే కార్యకర్తలు బ్రాహ్మణుల జంధ్యాలను తెంపివేయడం లాంటి తీవ్ర చర్యలకు పాల్పడ్డారు. ఇంతజరుగుతున్నా తమిళనాడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై బ్రహ్మణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో ప్రభుత్వం పనిచేస్తోందా అని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు.
టీపీడీకే కార్యకర్తలు బ్రాహ్మణులపై దాడులకు తెగబడడం ఇదే మొదటిసారికాదని గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగాయాని వారు చెప్పారు. గతంలోనూ బ్రాహ్మల జంధ్యాలను అపవిత్రం చేశారని అటువంటి సంఘాలపై వెంటనే నిషేధం విధించాలని వారు డిమాండ్ చేశారు. వృద్ధ బ్రాహ్మణులపై కూడా అమానుషంగా వ్యవహరిస్తున్న సంఘాపై కటిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. తమిళనాడులోని బ్రాహ్మణుల భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న ఘటనపై తక్షం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం టిపీడీకే కార్యకర్తల విషయంలో ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తోందని వారు ప్రశ్నించారు.
తాను ఏ రాజకీయా పార్టీకి చెందిన కార్యకర్తలం కాదని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో గానీ, పెరియార్ విగ్రహానికి జరిగిన అవమానానికి గానీ తమకు సంబందం లేదని వారు తేల్చి చెప్పారు. పెరియార్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నామని వారు తెలిపారు. తమిళనాడులోని బ్రాహ్మణుల భద్రతకు, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంమని దీన్ని ప్రభుత్వం వెంటనే తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here