సర్జికల్ స్ట్రైక్స్ పై అశక్తికర విషయాన్ని చెప్పిన కమాండర్

0
67
సర్జికల్ స్ట్రైక్స్

2016 సెప్టెంబరు 29న భారత భారత సైన్యం నియంత్రణ రేఖకు ఆవతల ఉన్న ఉగ్రవాద శిభిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అత్యంత క్లిష్టమైన సర్జికల్ స్ట్రైక్స్ ను భారత సైన్యం అత్యంత చాకచక్యంగా పూర్తి చేసింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాద శిభిరాలతో పాటుగా 50 మందిని భారత సైన్యం మట్టుపెట్టింది. అయితే ఈ సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన విశేషాలు పెద్దగా బయటి ప్రపంచానికి తెలియవు. దాడులు ఏవిధంగా నిర్వహించింది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎంతమంది ఆపరేషన్ లో పాల్గొన్నారు, ఎటువంటి ఆయుధాలు వాడారు లాంటి కీలక అంశాలను సైనిక దళాలు వెల్లడించలేదు. అయితే అడపాదడపా ఈ దాడులకు సంబంధించిన విశేషాలు బయటి ప్రపంచాలని తెలుస్తున్నాయి.
సర్జికల్ దాడులకు సంబంధించిన ఆశక్తికర విశేషాలను మాజీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజేంద్ర నింబోర్కర్‌ వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో బ్రిగేడ్‌ కమాండర్‌గా పనిచేసిన నింబోర్కర్‌ 2016లో సైన్యం చేపట్టిన సర్జికల్‌ దాడుల్లో పాల్గొన్నారు. ఆయన సేవలను గౌరవిస్తూ పుణెకు చెందిన థార్లో బాజీరావ్‌ పేష్వీ ప్రతిష్ఠాన్‌ ఆయన్ను సన్మానించింది. ఈ సందర్భంగా నింబోర్కర్‌ ఒక ఆశక్తికర విషయాన్ని తెలిపారు. సర్జికల్ దాడులు నిర్వహించే సమయంలో భారత సైనికులు కొన్ని గ్రామాలను దాటుకుని వెళ్లాల్సి వచ్చిందట. ఈ క్రమంలో కుక్కల బారినుండి తప్పించుకోవడానికి సైనికులు పెద్ద వ్యూహమే పన్నాల్సివచ్చిందట. కుక్కలు చిరుత పులులకు విపరీతంగా భయపడతాయి దీనితో చిరుత మల, మూత్రాలను గ్రామాల్లో చల్లుకుంటూ సైనిక దళాలు మెరుపుదాడులకు వెళ్లారట. చిరుత మలమూత్రాల వాసన పసిగిట్టిన గ్రామ సింహాలు కిక్కురు మనకుండా ఉండిపోవడంతో మన సైనికులు గ్రామాలను దాడుకుంటూ అటువైపు నక్కిన ఉగ్రమూకల భరతం పట్టినట్టు ఆయన వెల్లడించారు. నౌషెరా సెక్టార్‌లోని పలు ప్రాంతాల్లో చిరుతపులులు తరచూ శునకాలపై దాడులకు పాల్పడుతుంటాయని అది తమకు కలిసివచ్చిందని ఆయన వివరించారు.
సర్జికల్ దాడులను సైన్యం చాలా రహస్యంగా, పగడ్బందీగా నిర్వహించినట్టు నింబోర్కర్‌ తెలిపారు. ఉగ్రమూకల శిభిరాలను గుర్తించిన తరువాత వాటిపై దాడులు చేయాలనే నిర్ణయానికి వచ్చామని అయితే ఏ ప్రాంతంలో దాడులు జరుగుతాయనే విషయాన్ని ఆఖరినిమిషం వరకు సైనిక అధికారులు రహస్యంగా ఉంచారని ఆయన వివరించారు.

Troubling worms in little tummy


టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా | trs List of mla candidates
surgical strike, militants in Pakistan, Jammu and Kashmir,Uri,Indian army,Parachute Regiment.Line_of_Control_strike

Wanna Share it with loved ones?