బాణాసంచాపై ఢిల్లీలో నిషేధం…

దేశరాజధాని ఢిల్లీతో పాటుగా దాని పరిసర ప్రాంతైలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ మొత్తంలో బాణాసంచాపై నిషేధాన్ని సుప్రీంకోర్టు పునరుద్దరించింది. దీనితో రాజధాని వాసులు ఈ దఫా దీపావళి పండుగను నిశ్శబ్దంగా జరుపుకోనున్నారు. గత సంవత్సరం బాణాసంచా అమ్మకాలతోపాటుగా బాణాసంచా ను కాల్చడంపై నిషేధాన్ని విధించిన సుప్రీం కోర్టు ఆ తరువాత నిషేధాన్ని పాకిక్షంగా సడలించింది. గత సంవత్సరం సుప్రీం ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సుప్రీం తన ఆదేశాలను కాస్త సవరించుకుంది. అయితే దీపావళి వస్తున్న నేపధ్యంలో బాణాసంచా పై తిరిగి నిషేధం విధించాలంటూ కొంత మంది వేసిన పిటీషన్ విచారించిన సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టు తీర్పు తో ఢిల్లీ వాసులు బాణాసంచా కాల్చే అవకాశం లేకుండా పోయింది. బాణాసంచా దుకాణుదారుల లైసెన్సులను సస్పెండ్ చేశారు. అమ్మకాలు పూర్తిగా నిల్చిపోనున్నాయి. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బాణాసంచా కాల్చడం వల్ల తీవ్ర కాలుష్యం వెలువడుతోందని దీని వల్ల ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడుతున్నారంటూ కొన్ని సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా బాణాసంచా నిషేధం వైపే మొగ్గు చూపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *