మాల్స్, రెస్టారెంట్ల దోపిడీకి గ్రీన్ సిగ్నల్

0
41

హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ లలో ఎమ్మార్పీ కన్నా ఎక్కువ మొత్తాలకు అమ్ముకోవచ్చంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో మాల్స్, హోటళ్ల యాజమాన్యాలు ఆనందంతో ఉబ్బి తబ్బిబవుతున్నాయి. వినియోగదారుడిని అడ్డంగా దోచుకుంటున్న సంస్థలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో కోర్టును ఆశ్రయించిన వీరు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకన్నా మంచినీళ్లతో పాటుగా ఇతర పానియాలు, ఆహార పదార్థాలను విక్రయించడానికి వీలు లేదంటూ ప్రభుత్వం చట్టం చేసింది. దీనితో బాటిళ్లు, ప్యాకెట్లపై ప్రత్యేక ఎమ్మార్పీలను ముద్రించి బాహాటంగా వినియోగదారుడిని దోచుకుంటున్నారు. దీనితో బయటి మార్కెట్ కంటే ఎక్కువ ఎమ్మార్పీని ముద్రించి అమ్మకూడదని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. దీనిపై రెస్టారెంట్లు, మాల్స్, హోటళ్ల యజమానులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. కోర్టులో వీరి వాదనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
కొన్ని నిర్థేసిత ప్రాంతాల్లో సాధారణ మార్కెట్ కంటే అధిక ధరలను ముద్రించుకుని అమ్ముకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనితో పాటుగా ఈ వస్తువులు తూనికలు కొలతల శాఖ పరిధిలోకి రావని కూడా స్పష్టం చేసింది. దీనితో ఎమ్మార్పీ రేట్లను భారీగా పెంచేసీ అమ్ముకునేందుకు వీరు సిద్ధపడుతున్నారు. సాధారణ మార్కెట్ కంటే కొన్ని రెట్ల ఎక్కువ మొత్తానికి అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ వినియోగదారుడి జేబుకు చిల్లుపెడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లతో పాటుగా జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తమ ఇష్టానుసారం ఎమ్మార్పీ రేట్లను ముద్రించుకుని విక్రయాలు సాగిస్తున్న వారికి సుప్రీంకోర్టు తీర్పు వరంగా మారింది.



Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here