ముంబాయ్ సూపర్ కాప్ హిమాన్షు రాయ్ ఆత్మహత్య

పలు ప్రముఖ కేసులను దర్యాప్తు చేసిన పోలీసు అధికారి సూపర్ కాప్ గా పేరుగాంచిన హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రా యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ కు చీఫ్ గా పనిచేసిన రాయ్ ముంబాయిలోని మలబార్ హిల్స్ లో తన నివాసంలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం హిమాన్షు రాయ్ మెడికల్ లీవ్ పై ఇంట్లోనే ఉంటున్నారు.
రాయ్ నివాసం నుండి సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన తన సర్వీస్ రివాల్వర్ తో నోట్లో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు వెళ్లడించారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రెండు సంవత్సరాలుగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తాను జీవితంపై విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాయ్ ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొన్నారు. రెండు సంవత్సరాలుగా ఆయన బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.
అజానుబాహుడైన రాయ్ మహారాష్ట్ర పోలీసు విభాగంలో డైనమిక్ అధికారిగా పేరు సంపాదించుకున్నాడు. మహారాష్ట్రా యాంటీ టెర్రరిజన్ స్క్వాడ్ కు చీఫ్ గా పనిచేసిన సమయంలో హిమాన్షు రాయ్ పలు కీలక కేసులను చేధించడంతో పాటుగా సంఘ విద్రోహకర శక్తుల గుండెల్లో రైళ్లను పరుగెత్తించాడు. కొన్నిసార్లు ఆయన చట్టానికి అతీతంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నప్పటికీ రాయ్ పనితీరును మాత్రం ఎవరూ వెలెత్తి చూపించేవారు కాదు. టెర్రరిస్టుల ఆట కట్టించడంలో కరుగ్గా వ్యవహరించినా ఆయన పనితీరుతో పోలీసు వర్గాల్లో సూపర్ కాప్ గా పేరు సంపాదించుకున్నాడు.
గ్యాంగ్ స్టర్ చోటారాజన్ కు శిక్షపడిన జ్యోతిడే కేసు దర్యాప్తులో రాయ్ కీలక పాత్ర పోషించారు. ఈ కేసును ఓ కొలిక్కి తీసుకునిరావడంతో ఆయన చురుగ్గా పనిచేశారు. ఆయన ముంబాయి క్రైం బ్రాంచ్ చీఫ్ గా ఉన్న సమయంలోనే ముంబాయి ఉగ్రదాడి కేసులో పోలీసులకు పట్టుబడిన పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ కు శిక్షపడింది. 2013 ఐపీఎల్ ఫిక్సింగ్ కేసును కూడా ఆయన దర్యాప్తు చేశారు.
రాయ్ 1988 లో ఐపీఎసే కు ఎంపికయ్యారు. మహారాష్ట్రా క్యాడర్ కు చెందిన ఆయన పలు చోట్ల విధులు నిర్వహించారు. ఎక్కడ విధులు నిర్వహించినా హిమాన్షు రాయ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. బాంబే బాయ్ గా పేరుగాంచిన రాయ్ అనేక హై ఫ్రొఫైల్ కేసులకు దర్యాప్తుగా అధికారిగా వ్యవహరించారు. తనకు క్యాన్సర్ ఉన్నట్టు తెలిసిన తరువాత కూడా ఆయన కొద్ది రోజులపాటు విధలకు హాజరవుతూనే ఉన్నారు. ఆరోగ్యం మరీ క్షీణించడంతో ఆయన మెడికల్ లీవ్ పై వెళ్లారు.ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర పోలీసు విభాగంలో అఢిషన్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు.
himanshu Roy, Indian Police Service (IPS), Maharashtra Anti-Terrorism Squad, Additional Director General of Police, Mumbai Police,Roy committed suicide by shooting himself in the mouth,Mumbai supercop,cancer ,Hercules Roy,013 IPL spot-fixing investigation,commissioner of police in Mumbai.

అమిత్ షా కాన్వాయ్ పై దాడి


sri-devi
/Anti-Terrorism_Squad